Chiranjeevi – Savitri : సావిత్రితో చిరంజీవి చేసింది రెండు సినిమాలే.. ఏమేం సినిమాలంటే.. సావిత్రి అడగ్గానే..

తాజాగా సావిత్రి క్లాసిక్స్ అనే మరో బుక్ రిలీజ్ చేసారు. ఈ బుక్ ని మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ చేస్తూ ఈవెంట్ నిర్వహించారు.

Megastar Chiranjeevi Lanched Savitri Classics Book and Shares his Memories with Mahanati Savitri

Chiranjeevi – Savitri : మహానటి సావిత్రి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ జనరేషన్ కూడా మహానటిగా సావిత్రిని గుర్తుంచుకున్నారంటే ఆవిడ ఎంత గొప్ప నటి అనేది అందరికి అర్ధమవుతుంది. ఎన్నో గొప్ప సినిమాలు, పాత్రలతో ప్రేక్షకులని మెప్పించి ఎంతోమంది అభిమానులను సంపాదించి చివరిదశలో మాత్రం అనుకోకుండా కష్టాలు పడి అందరికి దూరం అయ్యారు. ఆవిడ దూరమైనా సినిమాల రూపంలో ఇప్పటికి మనతోనే ఉన్నారు.

గతంలో సావిత్రి గారి జీవిత కథగా మహానటి సావిత్రి అనే ఓ బుక్ రిలీజయింది. తాజాగా సావిత్రి క్లాసిక్స్ అనే మరో బుక్ రిలీజ్ చేసారు. సంజయ్ కిషోర్ రాసిన ఈ బుక్ ని మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా నిన్న రాత్రి హైదరాబాద్ లోని N కనెన్షన్ లో రిలీజ్ చేస్తూ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జయసుధ, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి, మురళీమోహన్.. అనేకమంది సినీ ప్రముఖులు హాజరయ్యారు.

Also Read : Vijay – Mrunal : ఎంతైనా విజయ్ రూటే సపరేటు.. ‘ఫ్యామిలీ స్టార్’ ప్రీ రిలీజ్‌లో బైక్‌పై మృణాల్‌తో ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ..

ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ సావిత్రితో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. చిరంజీవి మాట్లాడుతూ.. నాకు కెరీర్ మొదట్లోనే సావిత్రి గారితో కలిసి నటించే అవకాశం వచ్చింది. చిన్నప్పటి నుంచి నేను, మా నాన్న సావిత్రి గారి అభిమానులం. పునాది రాళ్లు సినిమాలో సావిత్రమ్మతో కలిసి నటించే అవకాశం వచ్చింది. రాజమండ్రిలో షూటింగ్ అవుతున్నప్పుడు నన్ను ఆమెకు పరిచయం చేసారు. ఆ తర్వాత షూట్ మధ్యలో వర్షం పడి షూటింగ్ ఆగిపోతే నన్ను సరదాగా డ్యాన్స్ వెయ్యమన్నారు సావిత్రి గారు. ఆమె అడగటం ఆలస్యం.. నా దగ్గర ఉన్న టేప్ రికార్డర్ ఓపెన్ చేసి ఇంగ్లీష్ సాంగ్స్ కి డ్యాన్స్ వేసాను. మధ్యలో జారీ పడితే కింద పడుకొని స్టెప్పులు వేసాను. అది చూసి సావిత్రమ్మ అభినందించి మంచి నటుడివి అవుతావు అని అన్నారు. ఇప్పటికి పాత సినిమాలు, పాటలు చూస్తే మొదట సావిత్రి గారివి చూడటానికే ఇష్టపడతాను. ఆవిడతో రెండు సినిమాలు చేశాను. పునాది రాళ్లు తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకు ప్రేమ తరంగాలు సినిమాలో ఆవిడతో కలిసి నటించాను. ఆ సినిమాలో సావిత్రమ్మ కొడుకు పాత్రలో నటించాను. తర్వాత మళ్ళీ ఆమెని కలిసే ఛాన్స్ రాలేదు అని తెలిపారు.

అయితే ఈ పుస్తకం లాంచింగ్ చిన్నగా కేవలం చిరంజీవిని వాళ్ళ ఇంట్లోనే కలిసి బుక్ రిలీజ్ చేసి ఫోటోలు తీసుకుంటే చాలు అనుకున్నారట. కానీ చిరంజీవి సావిత్రి గారి గురించి అందరికి తెలియాలని ఈ ఈవెంట్ నిర్వహించేలా చేసి పలువురు సినీ ప్రముఖులను కూడా ఆయనే పిలిచారని తెలిపారు. దీంతో చిరంజీవిని మరోసారి అంతా అభినందిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు