Chiranjeevi: తిరుపతి వర్షాలపై చిరు మెగా ట్వీట్!
మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా మరొకసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో ఒకటైన ఏపీలో కుండపోత వర్షం కురిసింది. మరో రెండు రోజులు రాష్ట్రంలో..
- Naresh Mannam
- Published on- November 19, 2021 / 01:30 PM IST
Chiranjeevi
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా మరొకసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో ఒకటైన ఏపీలో కుండపోత వర్షం కురిసింది. మరో రెండు రోజులు రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు చేసింది. గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు రాష్ట్రంలో పలు ప్రాంతాలు నీటమునిగాయి. ఆధ్యాత్మిక నగరం తిరుపతి అయితే.. జల ప్రళయంలో చిక్కుకుంది.
Tollywood Gossips: రూమర్స్‌ను నిజం చేస్తున్న మేకర్స్..!
తిరుమల తిరుపతిలో కురిసిన భారీ వర్షాల కారణంగా భక్తులు, స్థానికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తన మనసును కలచి వేశాయని చిరంజీవి వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం కలిసి కట్టుగా కృషి చేసి, సాధ్యమైనంత త్వరగా సాధారణ పరిస్థితులను నెలకొల్పాలని చిరంజీవి ట్వీట్ ద్వారా కోరారు.
Vindhya Vishaka: అందాలే ఆయుధంగా యాంకర్ వింధ్యా!
తిరుపతి ప్రజలు, భక్తులకు ఇబ్బందులను తొలగించి వారికి బాసటగా నిలిచేందుకు అన్ని రాజకీయ పక్షాలు మరియు తన అభిమాన సంఘాలు సైతం చేయూత నివ్వాల్సిందిగా కోరుతున్నా అంటూ చిరు విజ్ఞప్తి చేశారు. చిరంజీవి ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
