Aasmaan First Look : మేఘాంశ్ శ్రీహరి ఆస్మాన్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ చూశారా?
మీరు కూడా ఆస్మాన్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ చూసేయండి..
- Saketh U
- Published on- August 16, 2026 / 09:52 AM IST
Aasmaan First Look
Aasmaan First Look : శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా రాయంచ హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా ఆస్మాన్. కొండారు శ్రీనివాసరావు సమర్పణలో శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్ బ్యానర్ పై వెంకటేష్ కొండారు, శ్రీకాంత్ మన్నెం నిర్మాణంలో రామ్ నందన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు అరబిక్ భాషలో కూడా రిలీజ్ కానుంది.
దివంగత నటుడు శ్రీహరి జయంతి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను శనివారం నాడు రిలీజ్ చేశారు. ఈ మోషన్ పోస్టర్ లో పెద్ద అరచేయి మధ్యలో హీరో మేఘాంశ్ కాగడా పట్టుకుని నిలబడి ఉన్నాడు. అరచేయి చుట్టూ జనాలందరూ కాగడాలను పట్టుకుని నిలుచున్నారు. దీంతో ఇదేదో కొత్త కాన్సెప్ట్ అని క్యూరియాసిటీ నెలకొంది. ఈ సినిమాలో రవివర్మ, కమల్, కేశవ్ దీపక్, నిఖిల్, రాజశేఖర్, పద్మిని, ప్రేరణ గ్యాంగ్, సంతోష్, రమణ, కుమార్, సత్యరాజ్.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Also Read : Divi : టైట్ ఫిట్ జీన్స్ లో దివి స్టైలిష్ లుక్స్..
మీరు కూడా ఆస్మాన్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ చూసేయండి..
ఈ ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్లో శ్రీహరి భార్య శాంతి శ్రీహరి మాట్లాడుతూ.. మేఘాంశ్ మీద నమ్మకంతో ఆస్మాన్ సినిమా చేసేందుకు ముందుకు వచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. మేఘాంశ్‌ని పగలు, రాత్రి తేడా లేకుండా వర్క్ చేయిస్తున్నారు. శ్రీహరి గారు కూడా అలానే నటించేవారు. ఆస్మాన్ తో మేఘాంశ్‌కి మంచి విజయం దక్కాలని ఓ తల్లిగా కోరుకుంటున్నాను. నేను ఇప్పటికీ మేఘాంశ్‌ని చిన్న పిల్లాడిలానే చూస్తుంటాను. కానీ ఈ రోజు పోస్టర్ చూశాన తర్వాత సింహాన్ని చూసినట్టుగా అనిపించింది అని అన్నారు.
హీరో మేఘాంశ్ శ్రీహరి మాట్లాడుతూ.. రామ్‌తో వర్క్ చేయడం ఓ గొప్ప ఎక్స్‌పీరియెన్స్. సెట్‌లో ఎప్పుడూ ఓ పండుగ వాతావరణం కనిపించేది అని అన్నారు. దర్శకుడు రామ్ నందన్ మాట్లాడుతూ.. ఆస్మాన్ మూవీ అందరికీ ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది. అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. మేఘాంశ్ గారు బయట కూడా హీరోనే అని అన్నారు. నిర్మాత వెంకటేష్ మాట్లాడుతూ.. ఆస్మాన్ పోస్టర్ అద్భుతంగా ఉంది. పోస్టర్ చూస్తుంటే మాత్రం ఫుల్ ఎనర్జిటిక్‌గా అనిపిస్తోంది. మేఘాంశ్‌ది ట్రాన్స్‌ఫార్మర్‌లాంటి బాడీ. మేఘాంశ్ యాక్టింగ్ చూసి అందరం ఆశ్చర్యపోయేవాళ్లం. సెట్‌లో అందరి కంటే ముందుంటాడు. రియల్ స్టార్ కొడుకు అంటే ఇలానే ఉంటాడనిపించేలా ఉంటాడు అని అన్నారు.
హీరోయిన్ రాయంచ మాట్లాడుతూ.. ఆస్మాన్ కోసం నేను ఎంతో ఎదురు చూస్తున్నాను. కాన్సెప్ట్ పోస్టర్ నుంచి మాకు మంచి పాజిటివ్ వైబ్ వస్తోంది. కొన్ని రోజుల్లోనే షూట్ పూర్తి అవుతోంది అని తెలిపింది.
