Aasmaan Teaser : శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి ‘ఆస్మాన్’ టీజర్ చూసారా?

మీరు కూడా ఆస్మాన్ టీజర్ చూసేయండి..(Aasmaan Teaser)

  • Published on- September 16, 2026 / 12:35 PM IST

Aasmaan Teaser

Aasmaan Teaser : శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా, రాయంచ హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా ‘ఆస్మాన్’. కొండారు శ్రీనివాసరావు సమర్పణలో శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్ బ్యానర్ పై వెంకటేష్ కొండారు, శ్రీకాంత్ మన్నెం నిర్మాణంలో రామ్ నందన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. నేడు ఈ సినిమా టీజర్ ని మంచు మనోజ్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూస్తుంటే ఇదేదో సైకలాజికల్ థ్రిల్లర్ లా కొత్తగా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాలో రవివర్మ, కమల్, కేశవ్ దీపక్, నిఖిల్, రాజశేఖర్, పద్మిని, ప్రేరణ గ్యాంగ్, సంతోష్, రమణ, కుమార్, సత్యరాజ్.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్మాన్ సినిమాని తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, అర‌బిక్ భాష‌ల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Also See : Serial Actress Lavanya : ఇల్లు ఇల్లాలు ప్రియురాలు సీరియల్ నటి ‘లావణ్య’ సీమంతం వేడుకలు.. ఫోటోలు..

మీరు కూడా ఆస్మాన్ టీజర్ చూసేయండి..