Meghamsh Srihari : శ్రీహరి కొడుకు హీరోగా కొత్త సినిమా.. మేఘాంశ్ శ్రీహరి పాన్ ఇండియా సినిమా..

కొంచెం గ్యాప్ తర్వాత ఇప్పుడు మరో కొత్త సినిమాతో రాబోతున్నాడు. (Meghamsh Srihari)

  • Published On : April 4, 2026 / 07:10 PM IST

Meghamsh Srihari

Meghamsh Srihari : శ్రీహరి కొడుకు మేఘాంశ్ శ్రీహరి గతంలో రాజ్ దూత్, కోతికొమ్మచ్చి అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొంచెం గ్యాప్ తర్వాత ఇప్పుడు మరో కొత్త సినిమాతో రాబోతున్నాడు. మేఘాంశ్ శ్రీహరి హీరోగా ‘ఆస్మాన్’ అనే పాన్ ఇండియా సినిమా నేడు ఓపెనింగ్ కార్యక్రమం జరుపుకుంది.

శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై కొండారు వెంకటేష్, శ్రీకాంత్ మన్నెం నిర్మాణంలో రామ్ నందన్ దర్శకత్వంలో ఈ ఆస్మాన్ సినిమా తెరకెక్కుతుంది. నేడు ఈ సినిమా ఓపెనింగ్ పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సాయి దుర్గ తేజ్, సందీప్ కిషన్, విశ్వక్ సేన్, నిహారిక కొణిదెల, రోషన్ కనకాల, తిరువీర్, నార్నే నితిన్, రామ్ తాళ్లూరి.. పలువురు ముఖ్య అతిథులుగా వచ్చారు.

Also Read : Vanda Devullu : బిచ్చగాడు దర్శకుడితో విజయ్ ఆంటోని సినిమా.. ‘వంద దేవుళ్లు’ టీజర్ రిలీజ్..

ముహూర్తపు సన్నివేశానికి సాయి దుర్గ తేజ్ క్లాప్ కొట్టగా, సందీప్ కిషన్ స్విచ్ ఆన్ చేశారు. నిహారిక కొణిదెల స్క్రిప్ట్‌ని అందించగా తొలి సన్నివేశానికి రామ్ నందన్ దర్శకత్వం వహించారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమాని తెలుగు, తమిళ్, మలయాళం, అరబిక్ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.