Meghamsh Srihari : శ్రీహరి కొడుకు మేఘాంశ్ శ్రీహరి కొత్త సినిమా.. ఫస్ట్ లుక్ రిలీజ్..

తాజాగా మరో కొత్త సినిమాని ప్రకటించాడు మేఘాంశ్ శ్రీహరి. (Meghamsh Srihari)

  • Published on- August 14, 2026 / 06:42 PM IST

Meghamsh Srihari

Meghamsh Srihari : శ్రీహరి కొడుకు మేఘాంశ్ శ్రీహరి గతంలో రాజ్ దూత్, కోతికొమ్మచ్చి అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయ్యాడు మేఘాంశ్. ఇటీవలే స్టూడెంట్ అనే ఓ సినిమా టీజర్ రిలీజ్ చేసాడు. ఆస్మాన్ అనే ఓ కొత్త సినిమా ఓపెనింగ్ చేసాడు. తాజాగా మరో కొత్త సినిమాని ప్రకటించాడు మేఘాంశ్ శ్రీహరి.

Also See : Shanarthi Movie Opening : నాగదుర్గ- అఖిల్ కొత్త సినిమా ఓపెనింగ్ ఫొటోలు.. తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో మరో సినిమా..

మేఘాంశ్‌ శ్రీహరి హీరోగా భైరవకాళి బ్యానర్‌లో కొత్త సినిమా తెరకెక్కుతుంది. లెల్లా రోహిత్‌ దర్శకత్వంలో లెల్లా రాహుల్‌ నిర్మాణంలో ఈ సినిమా రానుంది. రేపు ఆగస్టు 15 శ్రీహరి పుట్టినరోజు కావడంతో ఆయన పుట్టిన రోజు సందర్భంగా నేడు మేఘాంశ్‌ శ్రీహరి కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.

ఈ ఫస్ట్ లుక్ లో తెలంగాణ సంస్కృతిలో భాగమైన పోతురాజు ఆహార్యంలో మేఘాంశ్‌ శ్రీహరి ఉన్నాడు. మేఘాంశ్‌ వెనుక పోతురాజు ఆహార్యంలో శ్రీహరి కూడా ఉండటం గమనార్హం. పవర్‌ఫుల్‌ లుక్స్ తో ఈ పోస్టర్ వైరల్ గా మారింది. ఇప్పటికే ఈ సినిమా 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమా టైటిల్ ప్రకటించనున్నారు.