Mirai Sequel : ‘మిరాయ్’ సీక్వెల్ టైటిల్ ఏంటో తెలుసా? కలియుగంలో రావణ వర్సెస్ రామ కథతో.. రావణుడు ఎవరంటే..

తేజ సజ్జ మిరాయ్ సినిమాకు కూడా క్లైమాక్స్ లో మంచి లీడ్ ఇచ్చి సీక్వెల్ అనౌన్స్ చేసారు.(Mirai Sequel)

Mirai Sequel

Mirai Sequel : తేజ సజ్జ హీరోగా మంచు మనోజ్ విలన్ గా తెరకెక్కిన మిరాయ్ సినిమా నేడు సెప్టెంబర్ 12న రిలీజయి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఇటీవల చాలా సినిమాలకు సీక్వెల్స్ అనౌన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో మిరాయ్ సినిమాకు కూడా క్లైమాక్స్ లో మంచి లీడ్ ఇచ్చి సీక్వెల్ అనౌన్స్ చేసారు.(Mirai Sequel)

సినిమా చివర్లోనే సీక్వెల్ కి ‘మిరాయ్ జైత్రయ’ అనే టైటిల్ ని ప్రకటించారు. మిరాయ్ సీక్వెల్ కథ రాముడు వర్సెస్ రావణుడు అన్నట్టు ఉండబోతుందని తెలుస్తుంది. మిరాయ్ సినిమా చివర్లో రానా గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చాడు. రానా ఏది తలచుకున్నా అది బంగారంలా మారిపోతుంది. అప్పటికే విలన్ చనిపోయాడని తెలిసి.. అమరత్వం వచ్చినా చనిపోయే ఆయుధం ఉందంటే అది నాకు కావాలి అని మిరాయ్ గురించి రానా అంటాడు. అలాగే త్రేతాయుగంలో జస్టిస్ జరగలేదు, ఇప్పుడు కలియుగంలో అయినా జరగాలి అని అంటాడు.

Also Read : Mirai Song : మళ్ళీ అదే పద్ధతి.. పాట సూపర్ హిట్.. సినిమాలో మాత్రం లేదు..

దీంతో రావణాసురుడు రాజ్యం సువర్ణ లంక కాబట్టి బంగారంతో రానాని రావణాసురుడు గా హింట్ ఇచ్చారని, త్రేతాయుగంలో న్యాయం జరగలేదు ఇప్పుడు జరగాలి అనే డైలాగ్ తో రాముడుతోనే యుద్ధం అన్నట్టు హింట్ ఇచ్చారని, అలాగే మిరాయ్ శ్రీరాముడి కోదండం అని చూపించడం, చివర్లో శ్రీరాముడు గురించి చూపించడంతో.. ఇలా ఈ లింక్స్ అన్ని కనెక్ట్ చేస్తూ మిరాయ్ జైత్రయ సినిమాలో రాముడు వర్సెస్ రావణాసురుడు కథ ఉండొచ్చు, రానా రావణాసుర పాత్ర అని, హీరో తేజ సజ్జా ఉన్నా రాముడు పాత్రలో ఇంకొకరిని తీసుకు రావొచ్చు అని విశ్లేషిస్తున్నారు సినిమా లవర్స్. మరి మిరాయ్ సీక్వెల్ ఎప్పుడు వస్తుంది, అది ఇంకే రేంజ్ లో ఉంటుందో చూడాలి.