MLA Naveen Yadav : సినిమా కార్మికుల పిల్లల కోసం స్కూల్.. సీఎం రేవంత్ గారు చెప్పారు.. నవీన్ యాదవ్ కామెంట్స్..

ఈ ఈవెంట్లో నవీన్ యాదవ్ మాట్లాడుతూ.. (MLA Naveen Yadav)

  • Published on- August 11, 2026 / 09:54 PM IST

MLA Naveen Yadav

MLA Naveen Yadav : సూర్య నటించిన విశ్వనాథ్ & సన్స్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో ఘనంగా జరిగుంది. ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ ఈవెంట్ కి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ హాజరయ్యారు.

Also See : Vaishnavi Chaitanya : వైష్ణవి చైతన్య బోనాలు స్పెషల్ ఫొటోలు.. ఫ్యామిలీతో పండగ సెలబ్రేషన్స్..

ఈ ఈవెంట్లో నవీన్ యాదవ్ మాట్లాడుతూ.. వెంకీ అట్లూరి మా ఫ్యామిలీ ఫ్రెండ్. వాళ్ళ నాన్న అట్లూరి సుబ్బారావు అంకుల్ ఒక రియల్టర్, ప్రొడ్యూసర్. హార్డ్ వర్కింగ్ పర్సన్. అంకుల్ లాగానే వెంకట్ అన్న కూడా మంచి సినిమాలు చేస్తూ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఎదుగుతున్నాడు. మాకు, సినీ ఫీల్డ్ కి 40 ఏళ్ళ అనుబంధం ఉంది. ఇక్కడ కార్మికులకు మా నాన్న ఎంతో సపోర్ట్ చేసారు. మా అన్న చిత్రపురి హోసింగ్ సోసిటీ లో వైస్ ప్రసిడెంట్ గా ఉన్నారు. మా బావ రాహుల్ నిర్మాతగా ఉన్నారు.

మొన్న బై ఎలక్షన్స్ లో సినిమా వాళ్లు నాకు సపోర్ట్ గా ఉండి నిలబడ్డారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా సినిమా కార్మికుల పిల్లల కోసం ఒక మంచి స్కూల్ కట్టాలని నాకు చెప్పారు. దాని కోసం ఒక ల్యాండ్ కూడా చూసాము. త్వరలోనే ఆ స్కూల్ వర్క్ మొదలవుతుంది. సినిమా వాళ్లకు ఎవరికి ఏదైనా సపోర్ట్ కావాలంటే నా దగ్గరకు రావొచ్చు అని అన్నారు.

Also Read : Vishwanath and Sons : సూర్య ‘విశ్వనాధ్ & సన్స్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్ ఇక్కడ చూసేయండి..