Sagar : అందుకే సీరియల్స్ మానేశాను.. మొగలిరేకులు RK నాయుడు..

సాగర్ ఎందుకు మళ్ళీ సీరియల్స్ చేయలేదో క్లారిటీ ఇచ్చాడు.

Sagar : సాగర్ అంటే ఎవరికి తెలియదు కానీ మొగలిరేకులు RK నాయుడు అంటే మాత్రం అందరికి తెలుసు. చక్రవాకం సీరియల్ లో జగన్ క్యారెక్టర్ తో పరిచయమై గుర్తింపు తెచ్చుకున్న సాగర్ ఆ తర్వాత మొగలిరేకులు సీరియల్ లో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ RK నాయుడు పాత్రలో అందర్నీ మెప్పించాడు. 2008 నుంచి 2013 వరకు మొగలిరేకులు(Mogalirekulu) సీరియల్ సక్సెస్ ఫుల్ గా సాగింది.

ఆ సీరియల్ లో RK నాయుడు పాత్ర అప్పట్లో పిల్లల దగ్గర్నుంచి పెద్దవాళ్ళ వరకు అందర్నీ మెప్పించింది. ఆ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న RK నాయుడు మొగలిరేకులు తర్వాత మళ్ళీ ఇప్పటివరకు ఇంకో సీరియల్ లో నటించలేదు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా సినిమాలు చేస్తున్నాడు. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ సాగర్ ని సీరియల్స్ లో మిస్ అవుతున్నారు. సీరియల్స్ ఎందుకు ఆపేసాడు అని ప్రశ్నిస్తూనే ఉన్నారు.

త్వరలో సాగర్ పోలీస్ పాత్రలో 100 అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో సాగర్ ఎందుకు మళ్ళీ సీరియల్స్ చేయలేదో క్లారిటీ ఇచ్చాడు. సాగర్ మాట్లాడుతూ.. మొగలిరేకులు సీరియల్, అందులో నా RK నాయుడు పాత్ర బాగా క్లిక్ అయింది. అందరికి ఆ సీరియల్ నచ్చింది. సీరియల్స్ అంటేనే ఫిమేల్ సెంట్రిక్ గా సాగుతాయి. కానీ మొగలిరేకులు కథ నా చుట్టూ తిరిగింది. ఆ పాత్ర ఇచ్చిన రేంజ్ తర్వాత చేస్తే అదే రేంజ్ లో సక్సెస్ అయ్యే పాత్రలు చేయాలి అనుకున్నాను. ఆ తర్వాత కూడా చాలా సీరియల్స్ ఆఫర్స్ వచ్చాయి. కానీ నాకు పేరు తెచ్చిన RK నాయుడు పాత్రని మించి ఏ పాత్ర రాలేదు అందుకే సీరియల్స్ చేయలేదు అని తెలిపారు.

Also Read : Chandini Chowdary : ఐపీఎల్ వ్యాఖ్యల వివాదంపై స్పందించిన చాందిని చౌదరి.. చాందినికి మద్దతుగా అభిమానులు, నెటిజన్లు..

ప్రస్తుతం సినిమాల మీద దృష్టి పెట్టిన సాగర్ మరి భవిష్యత్తులో అయినా సీరియల్స్ లో చేసి మళ్ళీ బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరవుతాడేమో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు