Chandini Chowdary : ఐపీఎల్ వ్యాఖ్యల వివాదంపై స్పందించిన చాందిని చౌదరి.. చాందినికి మద్దతుగా అభిమానులు, నెటిజన్లు..

గత కొన్ని రోజులుగా చాందినిపై SRH ఫ్యాన్స్ విమర్శలు చేశారు.

Chandini Chowdary : ఐపీఎల్ వ్యాఖ్యల వివాదంపై స్పందించిన చాందిని చౌదరి.. చాందినికి మద్దతుగా అభిమానులు, నెటిజన్లు..

Chandini Chowdary gives Clarity on her Comments about IPL Teams

Chandini Chowdary : తెలుగమ్మాయి చాందిని చౌదరి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇటీవల గామి సినిమాతో హిట్ కొట్టిన చాందిని త్వరలో మ్యూజిక్ షాప్ మూర్తి, యేవమ్ సినిమాలతో రాబోతుంది. అయితే మ్యూజిక్ షాప్ మూర్తి టీజర్ లాంచ్ ఈవెంట్లో చాందిని చౌదరిని.. మీ ఫేవరేట్ ఐపీఎల్ టీమ్ ఏంటి అని అడగగా.. నేను ఐపీఎల్ మ్యాచ్ లు ఒక్కటి కూడా స్టేడియంలో చూడలేదు. ఒక్కసారి మ్యాచ్ లు చూసి నేను ఆ టీమ్స్ నుంచి ఏది ఫేవరేట్ అని సెలెక్ట్ చేసుకుంటాను. మాది ఆంధ్ర, మా ఆంధ్రకు టీమ్ లేదు అని చెప్పింది.

సాధారణంగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఐపీఎల్ టీంకి సపోర్ట్ చేసుకుంటారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాలలో ఉండి కూడా చెన్నై, ముంబై, బెంగుళూరు టీమ్స్ కి సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. అయితే కొంతమంది SRH ఫ్యాన్స్ కావాలని చాందిని వ్యాఖ్యలను తప్పుబట్టి ఆమెపై ట్రోల్స్ చేశారు. SRH తెలుగు టీమ్ అంటూ, హైదరాబాద్ లో ఉంటూ హైదరాబాద్ టీమ్ కి సపోర్ట్ చేయవా అంటూ గత కొన్ని రోజులుగా చాందినిపై విమర్శలు చేశారు.

Also Read : Ranveer Singh – DSP : బాబోయ్.. ఊ అంటావా ఊ ఊ అంటావా అంటూ శంకర్ కూతురి పెళ్ళిలో ఊపేసిన దేవిశ్రీ ప్రసాద్, రణవీర్..

తాజాగా దీనిపై చాందిని చౌదరి తన సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ఓ ఈవెంట్లో నా ఫేవరేట్ ఐపీఎల్ టీమ్ ఏంటి అని అడిగితే నేను మ్యాచ్ లు చూడను కాబట్టి చూశాక చెప్తాను అన్నాను. అలాగే నేను ఆంధ్ర అమ్మాయిని కాబట్టి ఆంధ్రకు కూడా ఒక టీమ్ ఉంటే బాగుండు అన్నాను. దాన్ని ట్రెండింగ్ కి తగ్గట్టు వీడియో ఎడిట్ చేసుకొని ప్రమోట్ చేశారు. నేను నా రెండు స్టేట్స్ కి చెందిన దాన్ని. ఈ ఏడాది SRH టీమ్ కి అల్ ది బెస్ట్ అంటూ పోస్ట్ చేశారు.

అయితే దీనిపై చాందిని అభిమానులు, కొంతమంది నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తూ.. మీరు ఇలా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరి ఇష్టం వాళ్ళది, వాళ్ళ ట్రోల్స్ పట్టించుకోకండి, ఆంధ్రకు ఒక టీమ్ ఉండాలనుకోవడంలో తప్పులేదు అంటూ చాందినికి సపోర్ట్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఇక కొంతమంది SRH ఫ్యాన్స్ చాందినిపై మరోసారి విమర్శలు చేస్తున్నారు.