Ranveer Singh – DSP : బాబోయ్.. ఊ అంటావా ఊ ఊ అంటావా అంటూ శంకర్ కూతురి పెళ్ళిలో ఊపేసిన దేవిశ్రీ ప్రసాద్, రణవీర్..

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్, మన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ పెళ్ళిలో డాన్స్ అదరగొట్టేసారు.

Ranveer Singh – DSP : బాబోయ్.. ఊ అంటావా ఊ ఊ అంటావా అంటూ శంకర్ కూతురి పెళ్ళిలో ఊపేసిన దేవిశ్రీ ప్రసాద్, రణవీర్..

Devi sri Prasad Dance with Ranveer Singh in Director Shankar Daughter Marriage Video goes Viral

Updated On : April 30, 2024 / 6:49 AM IST

Ranveer Singh – DSP : ఇటీవల కొన్ని రోజుల క్రితం శంకర్ కూతురి పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే,. ఈ పెళ్ళికి అన్ని సినీ పరిశ్రమల నుంచి చాలా మంది స్టార్ సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ పెళ్లి సంగీత్ పార్టీలో పలువురు సెలబ్రిటీలు కూడా కొత్త జంటతో కలిసి డ్యాన్సులు వేశారు. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్, మన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ పెళ్ళిలో డాన్స్ అదరగొట్టేసారు.

Also Read : Thandel : వామ్మో.. నాగచైతన్య సినిమాని అన్ని కోట్లు పెట్టి కొన్న నెట్‌ఫ్లిక్స్.. చైతూ కెరీర్‌లోనే హైయెస్ట్..

తాజాగా నిన్న ఇంటర్నేషనల్ డాన్స్ డే సందర్భంగా దేవిశ్రీప్రసాద్ రణవీర్ తో కలిసి వేసిన డాన్స్ వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు. శంకర్ కూతురి పెళ్ళిలో ఈ డాన్స్ వేశారు. ఇందులో రణవీర్, దేవిశ్రీ ప్రసాద్ కలిసి ఊ అంటావా ఊ ఊ అంటావా పాటకు ఓ రేంజ్ లో ఊపేసారు. శంకర్ కూతురు కూడా వీళ్ళతో కలిసి డాన్స్ వేసింది. శంకర్, అతని ఫ్యామిలీ కూడా పక్కనే ఉన్నారు.

View this post on Instagram

A post shared by Devi Sri Prasad (@thisisdsp)

దేవిశ్రీ ప్రసాద్ ఈ వీడియో షేర్ చేయడంతో బాబోయ్ ఏంటి ఈ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. సమంతని మించి రణవీర్ డాన్స్ చేయడంతో ఈ వీడియో వైరల్ అవుతుంది.