Mohan Babu : రిపోర్టర్ పై మోహన్ బాబు దాడి.. మూడుచోట్ల విరిగిన ఎముకలు..

మంచు మోహన్ బాబు మీడియా రిపోర్టర్ పై దాడి చేసిన సంగతి తెలిసిందే.

Mohan Babu attack on reporter bones broken in three places

Mohan Babu : తాజాగా మంచు మోహన్ బాబు మీడియా రిపోర్టర్ పై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇందుకుగాను ఆయన పై సెక్షన్ 118 బి ఎం ఎస్ కింద కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. ఇవాళ మోహన్ బాబుతో పాటు మనోజ్, విష్ణు కూడా విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు పోలీసులు.

అయితే తాజాగా అందుకుతున్న సమాచారం మేరకు మోహన్ బాబు దాడి చేసిన రిపోర్టర్ పరిస్థితి కాస్త సీరియస్ గా ఉందనే అంటున్నారు. మోహన్ బాబు దాడి చేసిన వెంటనే ఆ రిపోర్టర్ ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న రిపోర్టర్ కి తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తుంది. అతని ముక్కుకు అలాగే చెవికి మధ్య మూడు చోట్ల ఎముకలు ఫ్యాక్చర్ అయినట్లు వైద్యులు తెలిపినట్టు తెలుస్తుంది.

Also Read : Mohan Babu : మోహన్ బాబు పై కేసు నమోదు.. జైలు శిక్ష ఖాయమా..

మరోవైపు మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేయడాన్ని జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. మీడియా ప్రతినిధులకు మోహన్ బాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.