Adipurush : ఆదిపురుష్ చూసేందుకు వచ్చిన కోతి.. వీడియో వైరల్!
ప్రభాస్ ఆదిపురుష్ సినిమా చూసేందుకు ఒక కోతి వచ్చింది. అందుకు సంబంధించిన వీడియోని ఆదిపురుష్ మూవీ టీం షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతుంది.
- gum 95921
- Published On : June 16, 2023 / 09:34 AM IST
Monkey watching Prabhas Adipurush in theater video viral
Prabhas Adipurush : రామాయణ కథాంశంతో ఈరోజు ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా ఆదిపురుష్. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్ లో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ (Kriti Sanon) సీతగా, సైఫ్ అలీఖాన్ (Saif Alikhan) రావణాసురుడిగా నటించిన ఈ సినిమా భారీ అంచనాలు మధ్య నేడు రిలీజ్ అయ్యింది. ఇక ఈ మూవీ ప్రదర్శించే ప్రతి థియేటర్ లో ఒక సీట్ హనుమంతుడు (Hanuman) కోసం కేటాయించాలి అంటూ దర్శకుడు ఓం రౌత్ నిర్మాతలను, డిస్ట్రిబ్యూటర్స్ ని కోరిన సంగతి తెలిసిందే.
Adipurush : ఆదిపురుష్ విజువల్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి..? గ్రాఫిక్స్ గురించి ఆడియన్స్ ఏమంటున్నారు..?
రామాయణ పారాయణం జరిగే ప్రతి చోట హనుమంతుడు విచ్చేస్తాడు అనే నమ్మకాన్ని గౌరవిస్తూ ప్రతి థియేటర్ ఓనర్స్ హనుమంతుడు కోసం ఒక సీట్ ప్రత్యేకంగా కేటాయించారు. కాగా ఆదిపురుష్ సినిమా ప్రదర్శితం అవుతున్న ఒక థియేటర్ లో కోతి ప్రత్యేక్షమయ్యింది. థియేటర్ విండోలో నుంచి వచ్చిన ఆ కోతి ఆదిపురుష్ సినిమాని చూస్తుంటే ఒక అభిమాని వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది కాస్త వైరల్ అవ్వగా ఆదిపురుష్ మూవీ టీం కూడా ఆ వీడియోని రీ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
Adipurush : ఆదిపురుష్‌లో తండ్రి కొడుకులుగా ప్రభాస్.. వైరల్ అవుతున్న ఫోటో!
కాగా ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, దశరథుడిగా.. తండ్రీకొడుకుల పాత్రలో కనిపించాడు. ఇక సినిమాలో హైలైట్స్ విషయానికి వస్తే.. రాముడు మరియు రావణాసురుడి ఎంట్రీ గూస్‌బంప్స్ వచ్చేలా చేస్తాయట. అలాగే హనుమాన్ సంజీవని తెచ్చే సీన్, లంకాదహనం సీన్స్ అదిరిపోయిని అని టాక్. ముఖ్యంగా సెకండ్ పార్ట్ లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు ప్రతిఒక్కరిని ఆకట్టుకునేలా ఉన్నాయి అంటున్నారు. ఇక శబరి మరియు సుగ్రీవుడుతో రాముడు సన్నివేశాలు అయితే ఎమోషనల్ గా ఉన్నాయని చెబుతున్నారు.
Hanumanji watching the movie #JaiShriRam #JaiBajarangBali #Adipurush https://t.co/jTNDYfNMz5
— #Adipurush ?? (@rajeshnair06) June 16, 2023
