Akhil Akkineni : బ్యా‌చ్‌లర్ బాబు వచ్చేస్తున్నాడు..

అఖిల్ అక్కినేని నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ దసరా కానుకగా విడుదల కానుంది..

  • Updated on- September 15, 2021 / 12:02 PM IST

Most Eligible Bachelor

Akhil Akkineni: యంగ్ హీరో అఖిల్ అక్కినేని, హాట్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’.. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ మీద బన్నీవాస్, దర్శకుడు వాసు వర్మ కలిసి నిర్మిస్తున్నారు.

Pooja Hegde : ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ లో పూజా పాప క్యారెక్టర్ ఇదేనంటగా..

ఇప్పటివరకు రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి.. అన్నీ అనుకున్నట్లుగా కుదిరితే జూన్ 19న ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్’ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేసుకున్నారు కానీ కరోనా సెకండ్ వేవ్ దెబ్బతో సీన్ రివర్స్ అయింది..

రీసెంట్‌గా న్యూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. అక్టోబర్ 8న బ్యాచ్‌లర్ బాబు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రిలీజ్ డేట్‌తో వదిలిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ తో మాంచి హిట్ కొడతానని ధీమాగా ఉన్నాడు అఖిల్ బాబు. ఈ సినిమాలో పూజా స్టాండప్ కమెడియన్‌గా కొత్త క్యారెక్టర్‌లో కనిపించనుంది.