Most Eligible Bachelor : ‘ఆహా’ లో అదరగొడుతున్న అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’..
‘ఆహా’ లో ‘ఆహా’ అనిపిస్తున్న అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ మూవీ..
- sekhar
- Published on- November 21, 2021 / 04:06 PM IST
Most Eligible Bachelor
Most Eligible Bachelor: బ్లాక్‌బస్టర్ సినిమాలు, ట్రెండీ వెబ్ సిరీస్, సెలబ్రిటీ టాక్ షోస్, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోతో ‘అన్‌స్టాపబుల్’ షో ప్లాన్ చేసి మరోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారడమే కాకుండా.. 2.ఓ అంటూ అప్డేటెడ్ వెర్షన్‌తో ప్రేక్షకులకు మరింత వినోదాన్ని పంచుతూ డిజిటల్ రంగంలో అగ్రగామిగా దూసుకుపోతున్న తొలి తెలుగు ఓటీటీ ‘ఆహా’ ఇప్పుడు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ మూవీతో మరింత సందడి చేస్తుంది.
Kartikeya Wedding : లోహితను పెళ్లాడిన కార్తికేయ..
యంగ్ హీరో అఖిల్ అక్కినేని, హాట్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’.. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ మీద బన్నీవాస్, దర్శకుడు వాసు వర్మ కలిసి నిర్మించారు. కాస్త గ్యాప్ తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది.
Romantic Movie : ‘ఆహా’ లో రొమాంటిక్..
దసరా కానుకగా అక్టోబర్ 15న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సూపర్ హిట్ టాక్‌తో పాటు అదిరిపోయే కలెక్షన్లు రాబట్టింది. హీరోగా అఖిల్‌కి ఫస్ట్ హిట్ ఇది. కమర్షియల్గానూ అందరికీ సంతృప్తినిచ్చాడు బ్యాచ్‌లర్. ఈ సినిమా ప్రస్తుతం ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతోంది.
Balakrishna – Krish : క్రేజీ కాంబో.. గీతా ఆర్ట్స్‌లో బాలయ్య సినిమా!
కేవలం రెండు రోజుల్లోనే అక్షరాలా 100 మిలియన్ మినిట్స్‌తో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందీ మూవీ. ఊహించని విధంగా వ్యూవర్స్ నుండి భారీ స్పందన వస్తున్నట్లు ‘ఆహా’ టీం అఫీషియల్ ట్విట్టర్ పేజ్‌లో వరుసగా అప్డేట్స్ ఇస్తున్నారు. ‘ఆహా’ లో అఖిల్ సినిమా థియేటర్ని మించి రెస్పాన్స్ తెచ్చుకోవడం విశేషం.
