Most Eligible Bachelor Trailer : ట్రైలర్ అదిరింది.. అఖిల్ హిట్ కొట్టేలా ఉన్నాడుగా..
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ట్రైలర్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది..
- sekhar
- Published On : September 30, 2021 / 06:44 PM IST
Most Eligible Bachelor Trailer
Most Eligible Bachelor Trailer: యంగ్ హీరో అఖిల్ అక్కినేని, హాట్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’.. అక్కినేని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైల్ వచ్చేసింది.
Most Eligible Bachelor : ట్రెండింగ్‌లో సూథింగ్ మెలోడీ..
పెళ్లి, పెళ్లి చేసుకోబేయే అమ్మాయి మీద పూర్తి క్లారిటీ ఉన్న కుర్రాడు.. అతనికి అపోజిట్‌గా ఆలోచించే అమ్మాయి.. వీళ్లిద్దరికీ ఎలా సెట్ అయిందనేది ఈ సినిమా కథ అన్నట్లు ట్రైలర్‌తో హింట్ ఇచ్చారు. అఖిల్, పూజాల కెమిస్ట్రీ అదిరిపోయింది. ముఖ్యంగా పెళ్లి చూపుల సీన్లన్నీ కూడా హైలెట్ అయ్యేలా అనిపిస్తున్నాయి.
Pooja Hegde : విబేధాల్లేవు.. పూజాతో పనిచెయ్యడం చాలా ఈజీ..
సినిమా మీద అంచనాలు పెంచుతూ.. అఖిల్ కచ్చితంగా హిట్ కొడతాడు అనిపించేలా ఉంది ట్రైలర్.. విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ మీద బన్నీవాస్, దర్శకుడు వాసు వర్మ కలిసి నిర్మించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ దసరా కానుకగా అక్టోబర్ 15న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది.
