HariHara VeeraMallu : ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ డేట్ పై మరోసారి క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. ఫ్యాన్స్ గెట్ రెడీ..
ఇప్పటికే హరిహర వీరమల్లు అనేకసార్లు వాయిదా పడింది.
- Saketh U
- Published On : May 21, 2025 / 03:37 PM IST
Movie Unit Gives Clarity on Pawan Kalyan HariHara VeeraMallu Movie Release Date
HariHara VeeraMallu : అయిదేళ్లుగా సాగిన హరిహర వీరమల్లు షూటింగ్ ఇటీవల పూర్తవడంతో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మొదటి పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు జూన్ 12న గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ అని అనౌన్స్ చేసారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, టీజర్, మూడు సాంగ్స్ రిలీజ్ చేసి అంచనాలు కూడా పెంచారు. ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఇప్పటికే హరిహర వీరమల్లు అనేకసార్లు వాయిదా పడింది. సినిమా అనౌన్స్ చేసిన దగ్గర్నుంచి ఆల్మోస్ట్ 9 సార్లు ఈ సినిమాని వాయిదా వేశారు. పలుమార్లు అధికారికంగా డేట్ అనౌన్స్ చేసి కూడా వాయిదా వేశారు. అయితే ఇప్పుడు జూన్ 12 రిలీజ్ అని చెప్పినా కొంతమంది నమ్మట్లేదు. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు అవ్వకపోవడంతో మరోసారి ఈ సినిమా వాయిదా పడుతుందని భావిస్తున్నారు.
తాజాగా నేడు హరిహర వీరమల్లు సినిమా మొదటి ప్రెస్ మీట్ నిర్వహించగా ఈవెంట్లో నిర్మాత ఏఎం రత్నం.. హరిహర వీరమల్లు సినిమా జూన్ 12 కచ్చితంగా రిలీజ్ అవుతుంది. సమయం చాలా తక్కువ ఉంది. ప్రమోషన్స్ కి సమయం సరిపోదు. అయినా రిలీజ్ చేస్తాం. ఇంకో రెండు ఈవెంట్స్ చేస్తాం అని తెలిపారు. ఇదే ఈవెంట్లో డైరెక్టర్ జ్యోతికృష్ణ, హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా జూన్ 12 రిలీజ్ అవుతుంది అని అధికారికంగా ప్రకటించడంతో మరోసారి ఈ సినిమా వాయిదా ఉండదు అని, జూన్ 12 కచ్చితంగా రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. మరి జూన్ 12 బాక్సాఫీస్ వద్ద హరిహర వీరమల్లు ఎన్ని రికార్డులు బద్దలుకొడుతుందో చూడాలి.
Also See : Nidhhi Agerwal : ‘హరిహర వీరమల్లు’ ప్రెస్ మీట్ లో చీరలో మెరిపించిన నిధి అగర్వాల్..
