Pawan Kalyan : మరోసారి ‘హరిహర వీరమల్లు’లో ఫైట్ కంపోజ్ చేసిన పవన్ కళ్యాణ్.. 50 రోజులు.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్..
ఈ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ జ్యోతికృష్ణ మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయం తెలిపారు.

Pawan Kalyan Compose Fight in HariHara VeeraMallu Movie
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మొదటి పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు జూన్ 12న గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కాబోతుంది. మొదటి సారి పవన్ పీరియాడిక్ సినిమా చేయడం, పాన్ ఇండియా సినిమా కావడం, పవన్ సినిమా వచ్చి రెండేళ్లు కావడం, డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ మొదటి సినిమా కావడంతో హరిహర వీరమల్లు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా నేడు హరిహర వీరమల్లు సినిమా నుంచి మూడో సాంగ్ రిలీజ్ చేసి మొదటి ప్రెస్ మీట్ ని నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ జ్యోతికృష్ణ మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయం తెలిపారు.
Also Read : Nidhhi Agerwal : ‘హరిహర వీరమల్లు’ ప్రెస్ మీట్ లో చీరలో మెరిపించిన నిధి అగర్వాల్..
డైరెక్టర్ జ్యోతికృష్ణ మాట్లాడుతూ.. హరిహర వీరమల్లు సినిమాలో ఓ పవర్ ఫుల్ ఫైట్ ఉంది. ఆ ఫైట్ బ్యాక్ గ్రౌండ్ లో అసుర హననం సాంగ్ వస్తుంది. ఆ ఫైట్ ని పవన్ కళ్యాణ్ గారే డిజైన్ చేసారు. అందుకే ఈ పాట కూడా బాగా వచ్చేలా చూసుకున్నాం. ఆ ఫైట్ ని ఆల్మోస్ట్ 50 రోజులు భారీగా షూట్ చేశాం అని తెలిపాడు.
ఆల్రెడీ పవన్ కళ్యాణ్ తమ్ముడు, బద్రి, ఖుషి, డాడీ, గుడుంబా శంకర్, సర్దార్ గబ్బర్ సింగ్, అజ్ఞాతవాసి.. సినిమాల్లో ఫైట్స్ కంపోజ్ చేసాడు. ఆ సినిమాల్లో ఒక్కో ఫైట్ కి ఫైట్ మాస్టర్ గా పనిచేసాడు. ఇప్పుడు మరోసారి హరిహర వీరమల్లులో ఫైట్ కంపోజ్ చేసాడు పవన్. మరి ఆ ఫైట్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.