ఆ గొంతు స్వరాల కార్ఖానా

  • Publish Date - September 25, 2020 / 07:52 PM IST

S.P. Balasubrahmanyam: ఎన్టీఆర్ కు పాడితే ఆయనే  పాడిన‌ట్టు, ఏన్నార్ పాడితే పాడితే, మైక్ పట్టుకొని ఆయనే పాడారన్నట్లుగా. కృష్ణంరాజు పాటైతే, ఆయన గొంతులోంచి వచ్చినట్లే. చిరంజీవి బంగారు కోడిపెట్ట పాటవిన్నా…మెగాస్టార్ తెర మీద పాడినట్లే. ఆనాటి నుంచి ఈ త‌రం హీరోల వ‌ర‌కూ అంద‌రూ కూడా గాయ‌కులేమో అనే అనుమానం  పుట్టించిన గాత్రం బాలుది.



ఎవరికి పాడినా, ఘంటశాలే పాడినట్లు. బాలు మాత్రం పూర్తిగా భిన్నం. కథానాయకుడే పాడినట్లు ఫీలింగ్. అది మిమిక్రీనా? అని ఓ ఇంట‌ర్వ్యూలో ఎస్పీబీని అడిగితే, అదేం కాదు‌. ఆ హీరోలు ఎలా మాట్లాడ‌తారో గ‌మ‌నించి వారి కోసం పాడిన‌ట్టుగా చెప్పారు బాలు‌.

త‌మిళ హీరోలు ఎలా మాట్లాడ‌తారు?  డైలాగ్ డెలివ‌రీని అబ్జర్వ్ చేసి పాడిన‌ట్టుగా ఆ ఇంట‌ర్వ్యూలో బాలూ అస‌లు సీక్రెట్ చెప్పారు.



బాలు తెలుగులో కెరీర్ ముందు మొద‌లుపెట్టారు. ఛాన్స్ ఇవ్వమని ఒక త‌మిళ సంగీత ద‌ర్శ‌కుడిని కలిస్తే, ముందు త‌మిళం బాగా నేర్చుకోవాల‌ని ఆయ‌న సూచించార‌ని, అందుకే పూర్తిగా నేర్చుకుని త‌మిళ సినిమా అవ‌కాశాల‌ను బాలూ కొట్టేశారంట.

తెలుగు వాళ్ల‌కు ఎంత ప్రియమైన గాయ‌కుడో, త‌మిళుల‌కూ అంతే ఇష్టుడు.  తెలుగు‌లో స్టార్ హీరోలు బాలూకూ దూరమైనా త‌మిళ స్టార్ హీరోలు మాత్రం బాలూతో త‌మ అనుబంధాన్ని కొన‌సాగించారు. క‌మ‌ల్, ర‌జ‌నీ సినిమాల్లో బాలూ పాట త‌ప్ప‌నిస‌రి.



అందుకే మనక‌న్నా త‌మిళులే ఎక్కువగా బాలు కోసం ఆరాటపడ్డారు. బాలూ ఇంట‌ర్వ్యూలు, గాన గంధర్వుడి ముచ్చ‌ట్లు నెల నుంచి ట్రెండింగ్. బాలూ కోలుకోవాల‌ని తెలుగు హీరోలూ స్పందించారు, మనమూ ప్రార్ధించాం. తెలుగు వారి క‌న్నా బాలూపై త‌మిళులు మ‌రింత ఎక్కువ మ‌మ‌కార‌మే చూపించారు.