కోపంగా కోపంగా వీడియో సాంగ్

మిస్టర్ మజ్ను- కోపంగా కోపంగా చూడొద్దే కారంగా వీడియో సాంగ్ రిలీజ్.

  • Publish Date - January 29, 2019 / 06:54 AM IST

మిస్టర్ మజ్ను- కోపంగా కోపంగా చూడొద్దే కారంగా వీడియో సాంగ్ రిలీజ్.

అక్కినేని అఖిల్, నిధి అగర్వాల్ హీరోయిన్స్‌గా, తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో, బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన మిస్టర్ మజ్ను.. ఈ నెల 25న రిలీజ్ అయ్యింది. అఖిల్, హలో సినిమాలకంటే బెటర్ అనే టాక్ రావడంతో అఖిల్ అండ్ అక్కినేని అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కట్ చేస్తే, కలెక్షన్‌లు మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. రీసెంట్‌గా ఈ సినిమాలోని, కోపంగా కోపంగా చూడొద్దే కారంగా అనే వీడియో సాంగ్ రిలీజ్ చేసింది మూవీ టీమ్.. అఖిల్, నిధి వెంటపడడం, ఆమె పట్టించుకోకపోవడం, అఖిల్ స్టెప్స్, థమన్ మ్యూజిక్, జార్జ్ సి.విలియమ్స్ ఫోటోగ్రఫీ, సాంగ్‌కి పర్‌ఫెక్ట్‌గా యాప్ట్ అయ్యాయి.

ఫారిన్‌లోని బ్యూటీఫుల్ లొకేషన్స్ కూడా బాగున్నాయి. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన మిస్టర్ మజ్ను, హీరోగా అఖిల్ కాస్త ఊరటనిచ్చిన సినిమా అవడం వరకూ ఓకే కానీ, బాక్సాఫీస్ దగ్గర ఏస్థాయిలో సత్తా చాటుతుందో మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.

వాచ్ కోపంగా వీడియో సాంగ్…