Syed Sohel : నా సినిమా కెరీర్‌లో ఆ సీన్స్ మాత్రం చేయను.. సోహైల్ శపథం దేని గురించి..?

మిస్ట‌ర్ ప్రెగ్నెంట్‌ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్న సోహైల్.. తన సినిమా కెరీర్‌లో ఆ సీన్స్ మాత్రం చేయను అని గట్టి శపథం చేసేశాడు.

Mr Pregnant hero Syed Sohel said no for liplock scenes

Syed Sohel : రియాలిటీ షో బిగ్ బాస్ తో సూపర్ ఫేమ్ ని సంపాదించుకున్న స‌య్య‌ద్ సోహైల్ ఆ తరువాత హీరోగా వరుస సినిమాలను ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నాడు. తాజాగా ఇప్పుడు మిస్ట‌ర్ ప్రెగ్నెంట్‌ (Mr Pregnant) అనే చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేశాడు. ఈ చిత్రం విషయంలో సోహైల్ పూర్తి నమ్మకంతో ఉన్నాడు. దీంతో తానే దగ్గర ఉండి ప్రమోషన్స్ అన్ని చూసుకుంటున్నాడు. సోషల్ మీడియా మీట్స్, ప్రెస్ మీట్స్ అంటూ మూవీని ఆడియన్స్ లోకి తీసుకు వెళ్లేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నాడు.

Tiger Nageswara Rao : పాన్ ఇండియా మార్కెట్‌లోకి గజదొంగ ఎంట్రీ.. టైగర్ నాగేశ్వరరావు టీజర్ రిలీజ్!

ఈక్రమంలోనే నేడు మీడియాతో ప్రత్యేక సమావేశం అయ్యారు. ఈ ఇంటరాక్షన్ లో సోహైల్.. మిస్ట‌ర్ ప్రెగ్నెంట్‌ విషయంలో ఎదురుకున్న సమస్యలు, ప్రెగ్నెంట్ గా నటించడం పై అనుభూతుని తెలియజేశాడు. అలాగే ఇదే ఈవెంట్ లో సోహైల్ ఒక విషయాన్ని కుండ బద్దలుకొట్టేసినట్లు చెప్పేశాడు. తన సినిమా కెరీర్‌లో లిప్ లాక్ సీన్స్ మాత్రం చేయను అని చెప్పేశాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న పలువురు యంగ్ హీరోలు దాదాపు లిప్ లాక్ సీన్స్ చేస్తూ వస్తుంటే, తాను మాత్రం అందుకు విరుద్ధం అని చెప్పేశాడు సోహైల్.

Priyanka Chopra : భర్త కన్సర్ట్‌లో స్టాఫ్‌కి స్నాక్స్ పంచుతూ కనిపించిన ప్రియాంక చోప్రా.. ఫిదా అయిన ఫ్యాన్స్

ఇక ఈ వ్యాఖ్యలు విన్న నెటిజెన్స్ సోహైల్ ని ప్రశంసిస్తున్నారు. కొంతమంది యంగ్ హీరోలు బోల్డ్ సీన్స్ చేస్తూ ఫేమ్ ని సంపాదిస్తుంటే, సోహైల్ లిప్ లాక్ కి కూడా విరుద్ధం అని చెప్పడంతో తెలుగు ఆడియన్స్ మెచ్చుకుంటున్నారు. ఇక మిస్ట‌ర్ ప్రెగ్నెంట్‌ విషయానికి వస్తే.. మగవాడు ప్రెగ్నెంట్ కావ‌డం అనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు. రూపా కొడవాయుర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా ఆగష్టు 18న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది.

 

ట్రెండింగ్ వార్తలు