Mrunal Thakur : మనకి ఎంత రెమ్యునరేషన్ కావాలో మనం అడగాలి.. అస్సలు మొహమాట పడకూడదు..
తాజాగా ఇండస్ట్రీలో హీరోయిన్స్ రెమ్యునరేషన్స్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. మృణాల్ ఠాకూర్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ............................
- Saketh U
- Updated on- December 19, 2022 / 12:15 PM IST
Mrunal Thakur comments on heroins remunerations
Mrunal Thakur : ఇటీవల సీతారామం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్. ఈ సినిమాలో సీత పాత్రలో నటించి అందర్నీ తన నటనతో, హావా భావాలతో మెప్పించి దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది. సీతారామం సినిమా మృణాల్ కి స్టార్ హీరోయిన్ హోదా తో పాటు అభిమానుల్ని కూడా భారీగా తెచ్చిపెట్టింది. అలాగే తన రెమ్యునరేషన్ ని కూడా పెంచేలా చేసింది.
తాజాగా ఇండస్ట్రీలో హీరోయిన్స్ రెమ్యునరేషన్స్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. మృణాల్ ఠాకూర్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ”ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ కి తాము ఎంత రెమ్యునరేషన్ తీసుకోవాలో తమకి క్లారిటీ ఉండదు. హీరోయిన్స్ కి ఉన్న హిట్స్ ని బట్టి, రేంజ్ ని, ఫ్యాన్ ఫాలోయింగ్ ని బట్టి ఇండస్ట్రీ వాళ్ళే మా రెమ్యునరేషన్స్ నిర్ణయిస్తారు. కానీ మాకు ఎంత కావాలో మేము అడగాలి, వాళ్ళు ఇస్తారా ఇవ్వరా అంత అమౌంట్ అనేది పక్కన పెడితే మేమైతే మాకు ఇంత రెమ్యునరేషన్స్ కావలి అని అడగాలి. రెమ్యునరేషన్ ని డిమాండ్ చేయడానికి భయపడకూడదు. అప్పుడే మన కెరీర్ లో కాన్ఫిడెంట్ గా ఉంటాము” అని తెలిపింది.
Chinmayi Sripada : అతనితో జాగ్రత్తగా ఉండు.. తమిళ నటిని హెచ్చరించిన చిన్మయి..
రెమ్యునరేషన్స్ గురించి ఇంతగా చెప్తుంది ఈ అమ్మడు ఎంత తీసుకుంటుందో అని అంటున్నారు. సీతారామం సినిమాతో భారీగానే హిట్ కొట్టిన మృణాల్ ఇప్పుడు సినిమాకి ఎన్ని కోట్లు తీసుకుంటుందో మరి.
