Mrunal Thakur: కీర్తి కాదు.. సాయి పల్లవి కాదు.. పక్కా తెలంగాణ సినిమాలో హీరోయిన్ గా మృణాల్
తెలుగులో వస్తున్న మరో క్రేజీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న మృణాల్ ఠాకూర్(Mrunal Thakur).
- V Santhosh Kumar
- Updated on- May 6, 2026 / 05:34 PM IST
mrunal thakur playing key role in venu yeldandi yellamma movie
- ‘బలగం’ వేణు ‘యల్లమ్మ’ క్రేజీ అప్‌డేట్.
- హీరోగా దేవిశ్రీ ప్రసాద్ ఎంట్రీ.
- హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ ప్రచారం.
Mrunal Thakur: ‘బలగం’ చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్నాడు వేణు వేల్దండి. ఆయన నుంచి వస్తున్న నెక్స్ట్ మూవీ ‘యల్లమ్మ’. పక్కా తెలంగాణ నేపధ్యంలో తెరకెక్కనున్న ఈ పాన్ ఇండియా సినిమాలో రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ప్రధాన పాత్ర చేస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది ఈ సినిమా. అయితే, ఈ ప్రెస్టీజియస్ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అనేది పెద్ద సవాలుగా మారింది.
Ram Gopal Varma: ఆ నిజాన్ని ఎలా మర్చిపోయారు.. మమతా బెనర్జీపై వర్మ షాకింగ్ కామెంట్స్
కథా బలమున్న ఈ సినిమాలో ముందు సాయి పల్లవి, కీర్తి సురేష్ వంటి స్టార్స్ నటిస్తున్నారు అంటూ వార్తలు వైరల్ గా మారుతున్నాయి. వీరిలో ఎవరు నటిస్తున్నారు అనేది ఇంకా క్లారిటీ రాలేదు. అయితే, తాజాగా ఈ లిస్టులో మరో స్టార్ హీరోయిన్ పేరు చేరింది. ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు. మృణాల్ ఠాకూర్(Mrunal Thakur). ప్రస్తుతం ఈ న్యూస్ టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
మృణాల్ ఠాకూర్ తెలుగులో ఇప్పటికే సీతారామం, హాయ్ నాన్న, డెకాయిట్ లాంటి సినిమాలో నటించి ఆడియన్స్ నుంచి ప్రశంసలు దక్కించుకుంది. గ్లామర్ పత్రాలు చేస్తూనే, పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలను ఎంచుకుంటూ మృణాల్ ట్రెండ్ సెట్టర్ గా మారింది. అలాంటి స్టార్ జానపద నేపథ్యం ఉన్న ‘యల్లమ్మ’ చిత్రంలో నటిస్తే సినిమాకు మరింత బలం చేకూరుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టులోకి మృణాల్ రావడంతో ఆమె ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ విషయం గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరి మృణాల్ అయినా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుందా లేక ఆమెను కూడా మార్చేస్తారా అనేది చూడాలి.
