Ram Gopal Varma: ఆ నిజాన్ని ఎలా మర్చిపోయారు.. మమతా బెనర్జీపై వర్మ షాకింగ్ కామెంట్స్
మమతా బెనర్జీపై రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) చేసిన లేటెస్ట్ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
ram gopal varma shocking tweet on mamata banerjee
- బెంగాల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం.
- రాజీనామాకు మమతా బెనర్జీ నిరాకరణ.
- మమత తీరుపై ఆర్జీవీ విమర్శలు.
Ram Gopal Varma; పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారత రాజకీయాల్లో అనూహ్య మార్పులకు వేదికయ్యాయి. 2026 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 207 స్థానాల్లో భారీ విజయం సాధించి, మమతా బెనర్జీ నేతృత్వంలోని 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ పాలనకు ముగింపు పలికింది. అయితే, ఊహించని విధంగా ప్రజా తీర్పును అంగీకరించి రాజీనామా చేయడానికి మమతా బెనర్జీ నిరాకరించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకురాలు ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది.
Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ సాంగ్ మేకింగ్.. షూటింగ్ ఫోటోలు షేర్ చేసిన ఆట సందీప్
ఈ పరిణామంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను గౌరవించకుండా పీఠాన్ని అంటిపెట్టుకుని ఉండటం ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. మమత తీరు విస్మయానికి గురిచేస్తోందని సోషల్ మీడియా వేదికగా ఆర్జీవీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన మెజారిటీని గుర్తించకపోవడం సరికాదని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
మరోవైపు మమతా బెనర్జీ తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల కమిషన్, బీజేపీ కుమ్మక్కై రిగ్గింగ్‌కు పాల్పడ్డాయని, కౌంటింగ్ సమయంలో తనపై భౌతిక దాడి కూడా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. నైతికంగా తామే విజేతలమని ప్రకటించిన ఆమె, అధికారిక పదవులకు దూరంగా ఉంటూ ‘ఇండియా’ కూటమి బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రస్తుతం బెంగాల్లో అధికారం బదిలీ ప్రక్రియ ప్రశాంతంగా సాగుతుందా లేదా అనే ఉత్కంఠ నెలకొంది.
After so many DECADES in POLITICIS and 15 years as C M , I can’t believe that @MamataOfficial is ignoring that DEMOCRACY by it’s very DNA is about INSTITUTIONS and attacking them amounts to attacking DEMOCRACY
— Ram Gopal Varma (@RGVzoomin) May 6, 2026
