Mrunal Thakur : ఆ ఇండస్ట్రీ నన్ను చాలా అవమానించింది..మృణాల్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు

మృణాల్ ఠాకూర్ బాడీ షేమింగ్ కి గురయ్యారట. తనను విమర్శించిన వారికి ఇచ్చేపడేశారట మృణాల్. ఇంతకీ ఎవరు?

Mrunal Thakur

Mrunal Thakur : మరాఠి సినిమా ‘విట్టి దండు’తో మృణాల్ ఠాకూర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు. బాలీవుడ్‌లో చాలానే సినిమాలు చేసినా తెలుగులో మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే రీసెంట్‌గా ఈ నటి బాలీవుడ్ మేకర్స్ నుండి బాడీ షేమింగ్‌కి గురయ్యానంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. మృణాల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మహేశ్ బాబు కూతురు సితారను కూడా వదలని సైబర్ నేరగాళ్లు.. ఏం జరిగిందంటే..

‘లవ్ సోనియా’ సినిమాతో అరంగేట్రం చేసిన మృణాల్ ఠాకూర్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అయితే తెలుగులో ‘సీతారామం’, ‘హాయ్ నాన్న’ వంటి సినిమాలతో వచ్చిన పేరు బాలీవుడ్‌లో ఎందుకో మృణాల్ సంపాదించుకోలేకపోయారు. అందుకు కారణాలను ఆమె ఇటీవల ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. బాలీవుడ్ అవకాశాల కోసం ప్రయత్నించి తను విసిగిపోయానని మృణాల్ చెప్పారు. అక్కడ విపరీతంగా బాడీ షేమింగ్‌కి గురయ్యానని అన్నారు.

Vijay Sales Valentine’s Day Deals : విజయ్ సేల్స్ వాలెంటైన్స్ డే డీల్స్.. ఈ స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్లు..!

మృణాల్ ఠాకూర్ బాలీవుడ్‌లో నటించేటప్పుడు ఇబ్బందులకు గురైనట్లు వెల్లడించారు. ముఖ్యంగా తన బాడీని ఉద్దేశించి కొందరు చేసిన కామెంట్స్ వల్ల హిందీ సినిమాలకు దూరంగా ఉన్నట్లు చెప్పారు. తను అందంగా ఉన్నా.. తన బాడీ సెక్సీగా లేదని కామెంట్ చేయడం.. ఇతర హీరోయిన్లతో కంపేర్ చేస్తూ మాట్లాడటం తనకు నచ్చలేదని మృణాల్ చెప్పారు. ఓ ఫోటోగ్రాఫర్ అయితే మరాఠీలో ఈ పల్లెటూరి పిల్ల ఎవరంటూ కామెంట్స్ చేసాడని.. ఆ తర్వాత సారీ చెప్పాడని మృణాల్ అన్నారు. తనను బరువు తగ్గమంటూ కూడా సలహాలు ఇచ్చారని అలాంటి వారికి స్ట్రాంగ్‌గా సమాధానం చెప్పానని మృణాల్ షేర్ చేశారు. అవసరమైతే తల్లి, చెల్లి పాత్రలు చేయడానికి కూడా వెనకాడనని వారికి చెప్పినట్లు మృణాల్ అన్నారు.  జెర్సీ, పిప్పా వంటి బాలీవుడ్ సినిమాల్లో నటించిన మృణాల్‌కి తెలుగులో మంచి పేరు వచ్చింది. సీతారామం, హాయ్ నాన్న తర్వాత విజయ్ దేవరకొండకి జోడిగా ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తున్నారు మృణాల్ ఠాగూర్. తెలుగులో మరికొన్ని ప్రాజెక్టుల్లో అవకాశాలు వచ్చినట్లు తెలుస్తోంది.