Mrunal Thakur : బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో మృణాల్ ఠాకూర్ పూజలు.. మా పేరెంట్స్ చెప్పినట్టే..
మృణాల్ ఠాకూర్ తన సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ చేసింది. నేడు మధ్యాహ్నం మృణాల్ ఠాకూర్ హైదరాబాద్ లోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని దర్శించుకుంది.
- Saketh U
- Published On : March 24, 2024 / 04:09 PM IST
Mrunal Thakur Visited Hyderabad Balkampet Yellamma temple and Photos Videos Shared
Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ లో దూసుకుపోతుంది. సినిమాలతో, ఫొటోలతో సోషల్ మీడియాలో హంగామా చేస్తూ చాలా మందికి ఫేవరేట్ హీరోయిన్ అయిపోయింది. మృణాల్ ఠాకూర్ విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, గ్లింప్స్, టీజర్ రిలీజయి అంచనాలు పెంచాయి. మూవీ యూనిట్ ప్రమోషన్స్ మొదలుపెట్టనున్నారు.
ఈ క్రమంలో మృణాల్ ఠాకూర్ తన సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ చేసింది. నేడు మధ్యాహ్నం మృణాల్ ఠాకూర్ హైదరాబాద్ లోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని దర్శించుకుంది. ఆ ఫోటోలు, వీడియోలు ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
Also Read : Pawan Kalyan : OG సినిమాలో పవన్ కళ్యాణ్ పేరు అదేనా? పవర్ ఫుల్ డైలాగ్ లీక్ చేసిన ఇమ్రాన్ హష్మీ..
ఆలయం వద్ద పూజలు మృణాల్ ఫోటోలు, వీడియో షేర్ చేస్తూ.. ఏదన్నా కొత్తగా లేదా పెద్దగా మొదలుపెట్టేముందు పూజ చేయమని మా పేరెంట్స్ ఎప్పుడూ చెప్తారు. కుదిరితే గుడికి కూడా వెళ్ళమని, ఇది ఎప్పుడూ గుర్తుంచుకొమ్మని చెప్తారు. అందుకే ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టేముందు ఫ్యామిలి స్టార్ ఫ్యామిలీతో హైదరాబాద్ లోని బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ ని దర్శించి ఆశీర్వాదాలు తీసుకున్నాను అని తెలిపింది. దీంతో మృణాల్ పోస్ట్ వైరల్ గా మారింది. పద్దతిగా వచ్చి, గుళ్లో పూజలు చేయడంతో మృణాల్ మన ట్రెడిషన్స్ ని ఫాలో అవుతుందని అభిమానులు, నెటిజన్లు అభినందిస్తున్నారు .
