Pawan Kalyan : OG సినిమాలో పవన్ కళ్యాణ్ పేరు అదేనా? పవర్ ఫుల్ డైలాగ్ లీక్ చేసిన ఇమ్రాన్ హష్మీ..

ఇమ్రాన్ హష్మీ పోస్ట్ చేసిన ఒక్క డైలాగ్ తోనే సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు.

Pawan Kalyan : OG సినిమాలో పవన్ కళ్యాణ్ పేరు అదేనా? పవర్ ఫుల్ డైలాగ్ లీక్ చేసిన ఇమ్రాన్ హష్మీ..

Emraan Hashmi Leakes Pawan kalyan OG Movie Dialogue

Pawan Kalyan : డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రాబోతున్న పవన్ కళ్యాణ్(Pawan Kalyan) OG సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఆల్రెడీ గ్లింప్స్ రిలీజ్ చేసి మరిన్ని అంచనాలు పెంచారు. ప్రస్తుతం ఎన్నికల హడావిడి ఉండటంతో పవన్ సినిమాలని పక్కన పెట్టారు. ఇంకొక్క షెడ్యూల్ పవన్ డేట్స్ ఇస్తే ఈ సినిమా అయిపోతుంది. సెప్టెంబర్ 27న పవన్ OG సినిమా రిలీజ్ చేయనున్నారు.

OG సినిమాలో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు. నేడు ఇమ్రాన్ హష్మీ పుట్టిన రోజు కావడంతో OG సినిమా నుంచి బర్త్ డే విషెష్ తెలుపుతూ ఇమ్రాన్ హష్మీ పోస్టర్ రిలీజ్ చేసారు. పోస్టర్ పై హ్యాపీ బర్త్ డే టు ఓమి భౌ అని రాసుంది. దీంతో ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ ఓమి భౌగా కనిపించబోతున్నాడని తెలుస్తుంది.

Also Read : Prithviraj Sukumaran : వేరే పరిశ్రమల రెమ్యునరేషన్స్‌పై పృథ్విరాజ్ సంచలన వ్యాఖ్యలు.. మా సినిమాలు అందుకే బాగుంటాయి..

అయితే ఇదే పోస్టర్ ని ఇమ్రాన్ హష్మీ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. గంభీరా, నువ్వు తితిగి బాంబే వస్తున్నావని విన్నా.. ప్రామిస్.. ఇద్దరిలో ఒక తలే మిగులుతుంది అని OG సినిమా డైలాగ్ పోస్ట్ చేశారు. దీంతో ఈ డైలాగ్ వైరల్ గా మారింది. ఒక్క డైలాగ్ తోనే సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు. ఈ డైలాగ్ తో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ పేరు ఈ సినిమాలో ‘గంభీరా’నా లేదా విలన్ అలా పిలుస్తాడా అంటే సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. ఇలాంటి పవర్ ఫుల్ డైలాగ్స్ సినిమాలో ఇంకా చాలా ఉండబోతున్నాయని తెలుస్తుంది. దీంతో పవన్ అభిమానులు పవర్ ఫుల్ డాన్ పాత్రలో పవన్ కళ్యాణ్ ని చూడటానికి ఆతృతగా ఎదురుచూస్తున్నారు.