ఇండియన్ కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోని భారత సైనికుల కోసం సొంతగా ఓ టీవి షో ప్రొడ్యూస్ చేయనున్నారు..
మహేంద్ర సింగ్ ధోని.. ఇండియన్ కెప్టెన్ కూల్‌గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రపంచం గుర్తించేలా క్రికెట్‌లో ఎన్నో రికార్డులు సృష్టించిన మిస్టర్ పర్ఫెక్ట్ ధోని ఇండియన్ ఆర్మీపై ఎప్పటికప్పుడు తన అభిమానాన్ని చాటుకుంటూ ఉంటాడు.
ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌గా గౌరవాన్ని పొందిన మహేంద్ర సింగ్ ధోని ఇప్పుడు మన సైనికుల కోసం మరో అడుగు ముందుకు వేయబోతున్నాడు. సొంతంగా ఒక టివి షోని ప్రొడ్యూస్ చేసేందుకు ధోని సిద్దమయ్యాడు. భారతదేశ సాయుధ దళాల పనితనాన్ని అలాగే వారు దేశం కోసం చేసిన, చేస్తున్న కృషిని గురించి అందరికీ తెలియచేసేలా ఈ షో నిర్వహించనున్నారట.
గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక క్రికెటర్ ఒక మంచి పనికి సిద్దమవడం విశేషం. స్టార్ ప్లస్‌లో షో టెలికాస్ట్ కానున్నట్లు సమాచారం. షో ఇంకా మొదలవ్వకముందే జనాల్లో ఈ న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. ధోని నిర్మిస్తున్న ఈ షో క్రేజ్ మామూలుగా ఉండదు మరి. ప్రస్తుతం ధోని రెస్ట్‌లో ఉన్న విషయం తెలిసిందే.