Seetimaarr : థియేటర్లలో గోపిచంద్ కూత మొదలు..
మ్యాచో హీరో గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్‌లో వస్తున్న ‘సీటీమార్’ సెప్టెంబర్ 3న థియేటర్లలో విడుదల కానుంది..

Seetimaarr
Seetimaarr: మ్యాచో హీరో గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్‌లో, మాస్ గేమ్ అయిన కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ‘సీటీమార్’. గోపిచంద్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్‌తో.. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు.
కబడ్డీ.. మైదానంలో ఆడితే ‘ఆట’ బయట ఆడితే ‘వేట’..
పాండమిక్ తర్వాత పరిస్థితులు అదుపులోకి రావడంతో థియేటర్లు రీ ఓపెన్ కావడంతో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సెప్టెంబర్ 3న హాళ్లలో కబడ్డీ కూత మొదలు కానుంది. ఈ సినిమాలో గోపిచంద్, తమన్నా ఇద్దరు వుమెన్ టీం కబడ్డీ కోచ్‌లుగా కనిపించనున్నారు.
మెలొడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో భూమిక చావ్లా కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన గోపిచంద్, తమన్నా లుక్స్‌కి, టీజర్ అండ్ సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్‌లో.. ‘రేయ్ కార్తి’.. అంటూ రావు రమేష్ పిలవగానే.. ‘నన్నెవడైనా అలా పిలవాలంటే ఒకటి మా ఇంట్లో వాళ్లు పిలవాలి, లేదా నా పక్కనున్న ఫ్రెండ్స్ పిలవాలి.. ఎవడు పడితే వాడు పిలిస్తే వాడి కూత ఆగిపోద్ది’.. అంటూ గోపిచంద్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది.
Mark the date and lock it!
We are Loading on Sept 3rd, Only in theatres. @YoursGopichand @IamSampathNandi@tamannaahspeaks @srinivasaaoffl @bhumikachawlat @SS_Screens @DiganganaS #Manisharma @adityamusic#SeetimaarrOnSept3 pic.twitter.com/PpZ59iaxCv
— Srinivasaa Silver Screen (@SS_Screens) August 24, 2021