Shri Krishna Avatar in Mahoba : కృష్ణావ‌తారంపై సినిమా.. శ్రీ కృష్ణ అవతార్ ఇన్ మహోబా..

ముకుంద్ పాండే ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ కృష్ణ అవతార్ ఇన్ మహోబా (Shri Krishna Avatar in Mahoba )అనే చిత్రం తెర‌కెక్కుతోంది.

Mukund Pandey Shri Krishna Avatar in Mahoba title announce

Shri Krishna Avatar in Mahoba : ముకుంద్ పాండే (Mukund Pandey) ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ కృష్ణ అవతార్ ఇన్ మహోబా (Shri Krishna Avatar in Mahoba) అనే చిత్రం తెర‌కెక్కుతోంది. అభయ్ చరణ్ ఫౌండేషన్, శ్రీజీ ఎంటర్‌టైన్‌మెంట్ ల‌పై అనిల్ వ్యాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ అనౌన్స్ కార్య‌క్ర‌మాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి క‌థ‌, స్క్రీన్ ప్లే సైతం ద‌ర్శ‌కుడు ముకుందు పాండేనే అందించారు.

11-12వ శతాబ్దాల నాటి ‘మహోబా’ సాంస్కృతిక వైభవాన్ని, అలాగే భగవాన్ శ్రీ కృష్ణుడి దివ్యత్వాన్ని, ధీరత్వాన్ని, ఆధ్యాత్మిక ప్రభావాన్ని ఈ చిత్రంలో చూపించ‌నున్న‌ట్లు చిత్ర బృందం తెలిపింది. చలన చిత్ర పరిశ్రమలో తొలిసారిగా శ్రీ కృష్ణుడిని ఒక యుద్ధవీరుడి పాత్రలో చూపించ‌నున్న‌ట్లుగా చెప్పారు.

Kishkindhapuri : ‘కిష్కింధపురి’ టీజ‌ర్ వ‌చ్చేసింది.. బెల్లంకొండ‌, అనుప‌మ మామూలుగా భ‌య‌పెట్ట‌లేదుగా..

పాన్ వ‌ర‌ల్డ్ ప్రాజెక్టుగా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ప్రపంచస్థాయి టెక్నీషియన్లతో ఈ చిత్రంలో పాలుపంచుకుంటున్నారు. ఈ చిత్రంలో న‌టించే నటీనటులు, సాంకేతిక బృందం, ఇతర వివరాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్న‌ట్లు తెలిపారు.