Raghava Lawrence: ఈ వ్యక్తి గురించి మీకు తెలిస్తే చెప్పండి.. రూ.1 లక్ష ఇస్తాను: రాఘవ లారెన్స్

ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ గురించి, ఆయన చేసే సేవా కార్యక్రమాల(Raghava Lawrence) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సమాజ సేవలో ఆయన చాలా ముందు ఉంటారు.

Raghava Lawrence: ఈ వ్యక్తి గురించి మీకు తెలిస్తే చెప్పండి.. రూ.1 లక్ష ఇస్తాను: రాఘవ లారెన్స్

Raghava Lawrence reacts 80-year-old man selling sweets

Updated On : September 11, 2025 / 8:58 PM IST

Raghava Lawrence: ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ గురించి, ఆయన చేసే సేవా కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సమాజ సేవలో ఆయన చాలా ముందు ఉంటారు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారని తెలిస్తే వెంటనే వెళ్లి సాయం అందిస్తారు. ఆయన సంపాదనలో ఎక్కువ శాతం కూడా సేవా కార్యక్రమాల కోసమే ఖర్చు చేస్తూ ఉంటారు. ఇప్పటికే చాలామంది అనాధలకు, వికలాంగులకు, పేద విద్యార్థులకు, రైతులకు తనవంతుగా ఆర్థికం సహాయం అందిస్తూనే ఉన్నారు. ఇటీవల ఆయన శ్వేత అనే దివ్యాంగురాలు కుటుంబానికి స్కూటీ బహుమతిగా ఇచ్చాడు. ఆ మధ్య ఒక మహిళకు ఆటో కొన్ని జీవనోపాధిని అందించారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.

Drishyam 3: దృశ్యం 3 అప్డేట్ ఇచ్చన దర్శకుడు.. ఆడియన్స్ కి ఆ విషయంలో నిరాశే.. ఇంకేముంటది మరి?

ఇప్పుడు తాజాగా మరోసారి తన దయాగుణాన్ని చాటుకున్నారు రాఘవ లారెన్స్(Raghava Lawrence). చెన్నై లోకల్‌ ట్రైన్స్‌లో దాదాపు 80 ఏళ్ల వృద్ధుడు చాలా కాలంగా స్వీట్స్ విక్రయిస్తున్నారు. ఆయనకు సంబందించిన ఒక వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ విషయాన్ని న్యూస్ ఛానెల్స్ కూడా కవర్ చేశాయి. అది కాస్త రాఘవ లారెన్స్ వరకు చేరడంతో వెంటనే రియాక్ట్ అయ్యారు. ఆ వృద్ధుడి వివరాలు ఎవరికైనా తెలిస్తే తెలియజేయాలని, రూ.లక్ష రూపాయల సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ ప్రకటించారు. ఈమేరకు ట్విటర్ వేదికగా ఒక వీడియో కూడా విడుదల చేశారు.

దీంతో లారెన్స్ విడుదల చేసిన ఈ వీడియోకి నెటిజన్స్ నుంచి కూడా విశేష స్పందన వస్తోంది. చాలా మంది లారెన్స్ చేస్తున్న ఈ పనిని చూసి ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ వృద్దుడికి సాయం అందాలని కోరుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక రాఘవ లారెన్స్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన కాంచన 4, బుల్లెట్టు బండి అనే సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.