Me Too: దర్శకుడికి సమన్లు..
- sekhar
- Published On : September 30, 2020 / 04:34 PM IST
Me Too – Payal Ghosh – Anurag Kashyap: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌కు ముంబైలోని వెర్సోవా పోలీసులు బుధవారం సమన్లు పంపించారు. అనురాగ్ కశ్యప్ తనను లైంగికంగా వేధించారని నటి పాయల్ ఘోష్ ఆరోపించిన విషయం తెలిసిందే.
మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి Me Too ఉద్యమం తరువాత పాయల్, అనురాగ్ కశ్యప్‌పై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే తనకు న్యాయం చేయాలంటూ పాయల్ ప్రధాని నరేంద్ర మోడీని, భద్రత కల్పించాలంటూ మహారాష్ట్ర గవర్నర్ బీఎస్‌కే కోష్యారీని కోరిన విషయం తెలిసిందే. పాయల్ ఘోష్ ఫిర్యాదు మేరకు ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేషన్‌లో పోలీసులు అనురాగ్‌పై కేసు నమోదు చేశారు.
ఇందులో భాగంగా రేపు (గురువారం) ఉదయం 11 గంటలకు పోలీసు స్టేషన్‌లో అనురాగ్ కశ్యప్ హాజరు కావాలని సమన్లలో పోలీసులు పేర్కొన్నారు.
ఇప్పటికే అనురాగ్‌పై ఐపీసీ సెక్షన్లు 376(ఐ), 354, 341, 342 సెక్షన్ల కింద కేసు చేశారు. కాగా విచారణకు హాజరు కావాల్సిందిగా అనురాగ్‌కు సమన్లు జారీ చేసిన వెర్సోవా పోలీసులకు థ్యాంక్స్ చెబుతూ, న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు పాయల్ ట్వీట్ చేసింది.
Thank you @MumbaiPolice … @anuragkashyap72 has been called tomorrow at versova police station for summoning and questioning. Let’s hope justice prevails….!!
— Payal Ghosh (@iampayalghosh) September 30, 2020
