Murthy Devagupthapu Nara Rohith Prathinidhi 2 Trailer released
Prathinidhi 2 Trailer : నారా రోహిత్ కెరీర్ లో మంచి హిట్టుగా నిలిచిపోయిన చిత్రం ‘ప్రతినిధి’. ఇప్పుడు ఆ మూవీకి సీక్వెల్ తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మూర్తి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండడం గమనార్హం. ఇప్పటికే రిలీజైన టీజర్ అండ్ పోస్టర్స్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు.
గాంధీ చనిపోయిన్నప్పుడు బాధతో చనిపోనివారు, రాజకీయ నాయకుడు చనిపోయినప్పుడు ఎందుకు చనిపోతున్నారు.. అంటూ ట్రైలర్ స్టార్టింగ్ లోనే నారా రోహిత్ వేసిన ప్రశ్న అందర్నీ ఆలోచించేలా చేస్తుంది. కొబ్బరికాయలు అమ్ముకునే స్టేజి నుంచి రాజకీయ నాయకుడు అయినవాడు, వాడి పక్కనే కాయలు అమ్ముకుంటున్న వాడిని ఎందుకు పట్టించుకోవడం లేదు.. ఇలాంటి చాలా ప్రశ్నలు ఈ సినిమాలో కనిపించబోతున్నాయని తెలుస్తుంది.
Also read : Deva Katta : రెండు సినిమాలకు కలిపి ఒకటే సీక్వెల్ తీసుకు వస్తానంటున్న దర్శకుడు.. ప్రస్థానం, రిపబ్లిక్..
అభివృద్ధి, రాష్ట్ర అప్పులు వంటి ప్రస్తుతం సమస్యలను ప్రధానంగా చూపిస్తూ ఈ సినిమాని తెరకెక్కించినట్లు తెలుస్తుంది. ఏప్రిల్ 25న ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నారు. మరి రోహిత్ కెరీర్ లో మైల్ రాయిగా నిలిచిపోయిన ప్రతినిధికి ఇది పర్ఫెక్ట్ సీక్వెల్ అవుతుందా లేదా చూడాలి.