నిహారిక ఎంగేజ్ మెంట్..వెల్ కమ్ బావ – వరుణ్ తేజ

  • Publish Date - August 14, 2020 / 07:37 AM IST

నా సోదరి నిహారిక నిశ్చితార్థం జరిగిందని, మా కుటుంబంలోకి వెల్ కమ్ బావ అంటూ నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ ఇన్ స్ట్రాగ్రామ్‌లో చేసిన ఓ ఫొటో వైరల్ అవుతోంది. గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు తనయుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యతో నిహారిక నిశ్చితార్థం జరిగింది.

నిరాడంబరంగా జరిగిన వేడుకకు మెగా ఫ్యామిలీ తరలివచ్చింది. ఆగస్టు 13వ తేదీ రాత్రి 8 గంటలకు హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోటల్‌లో ఈ వేడుక జరిగింది. కరోనా కారణంగా కేవలం…కొద్ది మంది ఫ్యామిలీ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.

చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, అల్లు అర్జున్, సుస్మిత, కళ్యాణ్ దేవ్, శ్రీజ, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ తదితరులు హాజరయ్యారు.

‘ఒక మ‌న‌సు, హ్యాపీ వెడ్డింగ్, సూర్య‌కాంతం’ సినిమాలలో కథానాయికగా నటించిన నిహారిక పెదనాన్న చిరంజీవి ‘సైరా’లో ఓ పాత్రలో కనిపించింది. త‌మిళ్‌లో విజ‌య్ సేతుప‌తితో ‘ఒరు న‌ల్ల నాల్ పాతు సొల్రెన్’ సినిమాలో నటించింది. అలాగే ‘ముద్దపప్పు ఆవకాయ్, నాన్న కూచి’ వంటి వెబ్‌సిరీస్‌లోను నటించిన నిహారిక కొద్ది గ్యాప్ తర్వాత వెబ్‌సిరీస్‌లపై ఫోకస్ పెట్టాలని ఆలోచిస్తున్నట్లు సమచారం.

ట్రెండింగ్ వార్తలు