Site icon 10TV Telugu

Mayookham : మైథలాజికల్ థ్రిల్లర్‌గా మయూఖం.. 

Mythological thriller movie mayookham

Mythological thriller movie mayookham

Mayookham : కుశలవ్, తన్మయి జంట‌గా న‌టిస్తున్న చిత్రం మయూఖం(Mayookham). వెంకట్ బులెమోని ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. మైథలాజికల్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని సినెటేరియా మీడియా వర్క్స్ బ్యానర్ పై శ్రీలత వెంకట్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్స‌వం శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో ఘ‌నంగా జ‌రిగింది.

ముహూర్తపు సన్నివేశానికి టీ సిరీస్ మ్యూజిక్ నుంచి ప్రియాంక మన్యాల్ క్లాప్ నివ్వగా, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దర్శకుల సంఘం ప్రెసిడెంట్ వీర శంకర్ ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు.

Chiranjeevi : అల్లు కనకరత్నమ్మ మృతి.. చిరంజీవి ఎమోషనల్ ట్వీట్

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు వెంకట్ బులెమోని మాట్లాడుతూ.. ఈ చిత్రం మైథలాజికల్ థ్రిల్లర్ అని చెప్పారు. ఆరేళ్లుగా కష్టపడి ఈ చిత్ర స్క్రిప్ట్ రెడీ చేసిన‌ట్లుగా తెలిపారు. దీన్నొక ఫ్రాంఛైజీలా.. ఒక యూనివర్స్ లా క్రియేట్ చేయబోతున్నామ‌న్నారు. వందశాతం ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ తో వస్తున్న తొలి ఇండియన్ మూవీ ఇదేన‌న్నారు. వాస్త‌వ సంఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో ఈ చిత్రం ఉంటుంద‌ని చెప్పుకొచ్చారు.

Exit mobile version