Mythri Movie Makers : మలయాళ ఇండస్ట్రీలోకి మైత్రీ మూవీ మేకర్స్.. తగ్గేదేలే!

శ్రీమంతుడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ప్రొడక్షన్ కంపెనీ 'మైత్రీ మూవీ మేకర్స్'. అప్పటి నుంచి వరుస విజయాలతో దూసుకుపోతుంది. టాలీవుడ్ లో విజయ పతాకాన్ని ఎగరేసిన ఈ నిర్మాతలు చూపు ఇప్పుడు పక్క ఇండస్ట్రీల మీద పడింది. ఇప్పటికే పఠాన్ డైరెక్టర్ తో హిందీలో ప్రభాస్ తో ఒక సినిమా ఒకే చేశారు. తాజాగా మలయాళ ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇస్తున్నారు.

Mythri Movie Makers : శ్రీమంతుడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ప్రొడక్షన్ కంపెనీ ‘మైత్రీ మూవీ మేకర్స్’. అప్పటి నుంచి వరుస విజయాలతో దూసుకుపోతుంది. కంటెంట్ ఉన్న సినిమాలను తెరకెక్కిస్తూ మైత్రీ నుంచి సినిమా వస్తుంది అంటే అది కచ్చితంగా బాగుంటుంది అనే ఒక నమ్మకాన్ని సంపాదించుకున్నారు. దీంతో అతి తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో నెంబర్ వన్ నిర్మాణ సంస్థగా నిలిచింది. ఈ ఏడాది మొదటిలోనే వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్టుని సొంతం చేసుకున్నారు.

Waltair Veerayya : అమెరికాలో మెగాస్టార్ మరో రికార్డు.. కొనసాగుతున్న వాల్తేరు వీరయ్య ప్రభంజనం..

ఏ భయం లేకుండా ఒకే సమయంలో రెండు సినిమాలను రిలీజ్ చేసి హిట్టుని అందుకొని డేరింగ్ అండ్ డాషింగ్ నిర్మాతలు అనిపించుకున్నారు. ఇక ఈ రెండు చిత్రాలతో డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి కూడా అడుగు పెట్టారు. నైజాంలో తమ సొంత డిస్ట్రిబ్యూషన్ హౌస్‌ను ప్రారంభించి దిల్ రాజుకి పోటీగా నిలిచారు. ఇది ఇలా ఉంటే టాలీవుడ్ లో విజయ పతాకాన్ని ఎగరేసిన ఈ నిర్మాతలు చూపు ఇప్పుడు పక్క ఇండస్ట్రీల మీద పడింది. ఇప్పటికే పఠాన్ డైరెక్టర్ తో హిందీలో ప్రభాస్ తో ఒక సినిమా ఒకే చేశారు. తాజాగా మలయాళ ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇస్తున్నారు.

Veerasimha Reddy : వీరసింహుని విజయోత్సవం.. గ్రాండ్‌గా రేపే..

మలయాళ చిత్ర పరిశ్రమలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టోవినో థామస్‌తో కలిసి ఒక సినిమా చేయబోతున్నట్లు ఈ శనివారం ప్రకటించారు. మలయాళ సూపర్ హిట్ సినిమా డ్రైవింగ్ లైసెన్స్ ని తెరకెక్కించిన లాల్ జెఆర్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి నడికర్ తిలకం అనే టైటిల్‌ను ఖరారు చేశారు. నిన్న మూవీ అనౌన్స్‌మెంట్ చేస్తూ ఒక మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో టోవినో శిలువ వేయబడిన క్రీస్తుగా నీటిలో మునిగిపోయి కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ అందరిలో క్యూరియాసిటీని పెంచుతుంది. కాగా ఈ పోస్టర్ ని పోస్ట్ చేస్తూ ‘సేవ్ ది ఓషన్’ అనే హాష్ ట్యాగ్ ఇచ్చారు. దీని బట్టి ఇది ఏదో మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అని అర్ధమవుతుంది.

ట్రెండింగ్ వార్తలు