Naatu Naatu Song : గట్టు మీద గడ్డపారలు! ఫ్యూజ్‌లు ఎగిరిపోయేలా ఎన్టీఆర్ – చరణ్ డ్యాన్స్ !
‘నాటు నాటు’ అంటూ ఊరమాస్ స్టెప్పులతో ఇరగదీసేశారు ఎన్టీఆర్ - చరణ్..
- sekhar
- Updated on- November 10, 2021 / 03:11 PM IST
Naatu Naatu Song
Naatu Naatu Song: ‘ఆర్ఆర్ఆర్’ రూపంలో మరోసారి తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చూపించబోతున్నారు రాజమౌళి. గత మూడేళ్లుగా ఈ సినిమా మీదే రాత్రి, పగలు తేడా లేకుండా కష్టపడుతున్నారు జక్కన్న అండ్ టీం. ఇప్పటివరకు రిలీజ్ చేసిన రామ్, భీమ్ టీజర్స్, గ్లింప్స్, పోస్టర్లన్నీ కూడా ఒకదాన్ని మించి మరోటి అంచనాలు పెంచేసాయి.
RRR Movie : ఓరి మీ దుంపలు తెగ.. వైరల్ అవుతున్న ఫన్నీ పోస్ట్..
బుధవారం ‘ఆర్ఆర్ఆర్’ లోని ‘నాటు నాటు’ లిరికల్ వీడియో రిలీజ్ చేశారు. స్వరవాణి కీరవాణి తన మ్యూజిక్‌తో చేశారు. తన పదాలతో ఎన్నో పాటలకు మరింత అందాన్ని తీసుకొచ్చిన చంద్రబోస్ లిరిక్స్ రాశారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ సింగర్‌గా ఆడియన్స్‌ను ఆకట్టుకున్న కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్‌తో కలిసి చాలా చక్కగా, ఎనర్జిటిక్‌గా పాడాడు. ఈ పాటతో సినిమా మీద అంచనాలు ఆకాశన్నంటేసాయి.
Jr NTR : సీనియర్ ఫ్యాన్‌తో జూనియర్..
ఎన్టీఆర్ – చరణ్ ఇద్దరూ క్లాస్ గెటప్స్‌లో ఊర నాటు స్టెప్పులతో అదరగొట్టేసారు. ఇద్దరు బెస్ట్ డ్యాన్సర్స్ కలిసి ఓ పాటలో మూమెంట్స్ వేస్తే సిల్వర్ స్క్రీన్ షేక్ అవడం.. రికార్డ్స్ బ్రేక్ అవడం పక్కా అని కొత్తగా చెప్పక్కర్లేదు. 2022 జనవరి 7న ‘ఆర్ఆర్ఆర్’ ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది.
