Naga Chaitanya : నా బేబీ సిసింద్రీకి హిట్.. లెనిన్ సక్సెస్ మీట్ లో నాగచైతన్య ఎమోషనల్ స్పీచ్..

ఈ ఈవెంట్లో నాగ చైతన్య మాట్లాడుతూ..(Naga Chaitanya)

  • Updated on- July 20, 2026 / 08:21 PM IST

Naga Chaitanya

Naga Chaitanya : ఇటీవల అఖిల్ లెనిన్ సినిమాతో వచ్చి మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే 80 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మొదటిసారి అఖిల్ హిట్ కొట్టడంతో అభిమానులు, టాలీవుడ్, అక్కినేని ఫ్యామిలీ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రెండు సక్సెస్ మీట్స్ నిర్వహించగా నేడు లెనిన్ బ్లాక్ బస్టర్ వైభవం పేరుతో మరో ఈవెంట్ నిర్వహించారు.

ఈ ఈవెంట్ కి మూవీ టీమ్ తో పాటు నాగచైతన్య, నాగార్జున కూడా హాజరయ్యారు. అఖిల్ తో కలిపి ముగ్గురు అక్కినేని హీరోలు ఒకలిసి ఒకే స్టేజిపై కనిపించి సందడి చేసారు.

Also Read : Sudigali Sudheer : టీవీ షోలో ఒకరి కాలర్ ఒకరు పట్టుకొని సీరియస్ అయిన సుడిగాలి సుధీర్, అనిల్ రావిపూడి.. పోమో వైరల్..

ఈ ఈవెంట్లో నాగ చైతన్య మాట్లాడుతూ.. తమ్ముడు కొంచెం లేట్ గా వచ్చినా మీరు లేటెస్ట్ గా సపోర్ట్ చేసారు. నేను ప్రతి ఈవెంట్ చూస్తున్నా మీ ఎనర్జీ, సౌండ్ మారిపోయింది. సంతోషంగా ఉంది. ఈ కథ ఒప్పుకున్నప్పుడే అఖిల్ హీరో అయ్యాడు. ఈ కథ నేను విన్నప్పుడు నాకు భయం వేసింది. ఒక పాతిక సినిమాలు చేసాక, అనుభవం ఉన్నాక చేసే పాత్ర ఇది. లెనిన్ పాత్రకు, అఖిల్ రియల్ లైఫ్ కి ఎలాంటి సంబంధం లేదు. కానీ దాన్ని సొంతం చేసుకొని కష్టపడి చేసాడంటే నిజంగా అఖిల్ హీరో అయ్యాడు. ఒక అన్నయ్యగా, ఒక ప్రేక్షకుడిగా, ఒక అభిమానిగా చెప్తున్నా నేను చాలా గర్వపడుతున్నా అఖిల్.

నాన్న కింగ్ ఫైర్ నాకు, అఖిల్ కి మాత్రమే తెలుసు. ఆయన ఒక ఛాలెంజ్ పెట్టుకుంటే ఎలా కష్టపడతాడో మాకు తెలుసు. బంగార్రాజు, మనం తర్వాత మళ్ళీ ఇప్పుడు లెనిన్ కి చూసాను నాన్నను అలా. ఈ కథ విన్నప్పుడు నాన్న ఇప్పుడు ఇది కరెక్టా? ఆలోచించండి అన్నాను. కానీ చేసి చూపిస్తా అన్నారు. ఈ డైరెక్టర్ సవ్యసాచి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసాడు. అతని రెండో సినిమాకి నేను సక్సెస్ ఈవెంట్ కి రావడం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో క్లైమాక్స్, విలన్ హీరోని రౌండప్ చేసే సీన్స్ నాకు చాలా నచ్చాయి. నా బేబీ సిసింద్రీకి ఒక పెద్ద హిట్ ఇచ్చినందుకు థ్యాంక్స్. అఖిల్ ఎన్ని సినిమాలు చేసినా నాకు ఎప్పుడూ చిన్న సిసింద్రీనే అంటూ ఎమోషనల్ అయ్యారు.