Anil Ravipudi-Sudigali Sudheer: టీవీ షోలో ఒకరి కాలర్ ఒకరు పట్టుకొని సీరియస్ అయిన సుడిగాలి సుధీర్, అనిల్ రావిపూడి.. పోమో వైరల్..
Anil Ravipudi: ఈ షోకి అనిల్ రావిపూడి, శ్రీకాంత్, రోజా జడ్జీలుగా ఉండగా సుడిగాలి సుధీర్ యాంకర్ గా హోస్ట్ చేస్తున్నారు. (Sudigali Sudheer)
Sudigali Sudheer Anil Ravipudi Serious Fight in TV Show Promo
Anil Ravipudi-Sudigali Sudheer : టీవీ షోలో డైరెక్టర్ అనిల్ రావిపూడి, సుడిగాలి సుధీర్ ఒకరి కాలర్ ఒకరు పట్టుకున్న ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారింది. జీతెలుగు ఛానల్ లో డ్రామా జూనియర్స్ అనే కామెడీ స్కిట్స్ ప్రోగ్రాం వస్తుంది. చిన్నపిల్లలతో ఇందులో స్కిట్స్ చేయిస్తూ ఉంటారు. ఈ షోకి అనిల్ రావిపూడి, శ్రీకాంత్, రోజా జడ్జీలుగా ఉండగా సుడిగాలి సుధీర్ యాంకర్ గా హోస్ట్ చేస్తున్నారు.
ఈ ప్రోగ్రాం ప్రేక్షకులను ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తుంది. తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో ఓ సినిమా సన్నివేశానికి స్పూఫ్ స్కిట్ చేస్తూ.. సుధీర్ అనిల్ రావిపూడిని సినిమాలో ఓ వేషం ఇవ్వండి అని అడగ్గా అనిల్.. సుధీర్ ని నువ్వు హీరోగా చేసావు, మళ్ళీ ఫ్రెండ్ పాత్ర చేస్తావా అంటూ షర్ట్ పట్టుకున్నాడు. అయితే ఇది కామెడీగానే సాగింది.
Also Read : Chiranjeevi : చిరంజీవి పుట్టిన రోజు.. సీనియర్ అభిమానులకు బంపర్ ఆఫర్.. ఏకంగా 5 లక్షలు..
కానీ ఆ తర్వాత రోల్స్ రివర్స్ అని చెప్పి సుధీర్ అనిల్ తో డైలాగ్ చెప్తూ అనిల్ రావిపూడి చొక్కా పట్టుకున్నాడు. దీంతో షోలో ఉన్నవాళ్ళంతా షాక్ అయ్యారు. వీళ్లిద్దరి మధ్య సీరియస్ అయిందా అనే రేంజ్ లో ప్రోమో అక్కడే ముగించడం గమనార్హం. మరి దాని తర్వాత ఏమైందో తెలియాలంటే షో చూడాల్సిందేనేమో. ఇలా అనిల్ రావిపూడి – సుడిగాలి సుధీర్ ఒకరి చొక్కా ఇంకొకరు పట్టుకోవడంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది.
మీరు కూడా ఈ ప్రోమో చూసేయండి..
