Naga Chaitanya makes interesting comments on doing a film with father Nagarjuna
Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అక్కినేని నాగార్జున నటవారసుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమా జోష్ అంతగా ఆడకపోయినా.. రెండో సినిమా “ఏం మాయ చేశావే”తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తరువాత చేసిన 100 % లవ్ సినిమాతో లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత వరుస సినిమాలు చేస్తూ వచ్చిన నాగ చైతన్యకి తండేల్ (Naga Chaitanya)సినిమాతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ పడింది. సాయి పల్లవి హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమా ఎమోషనల్ హిట్ గా నిలిచింది.
Vijay-Rashmika: ప్రేమ వీళ్లదే.. కానీ, కారణం మాత్రం ఆ దర్శకుడేనట.. ఇంతకీ ఆ సంగతేంటో!
ఇదిలా ఉంటే, తాజాగా జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షోకి హాజరయ్యారు నాగ చైతన్య. ఈ షోలో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను ఆడియన్స్ తో పంచుకున్నాడు నాగ చైతన్య. ఇందులో భాగంగా ఆయన తన నాన్న నాగార్జునతో కలిసి నటించడం గురించి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. “నాన్నకి ఏది కూడా ఓ పట్టాన నచ్చదు. ఇంకా మా ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే అంతే ఇక. ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కారు. ప్రతీ విషయంపై చాలా కేర్ తీసుకుంటారు. నా క్యారక్టర్స్ లో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకుంటారు. అందుకే, చాలా టేకులు, కథలో మార్పులు చేయాల్సి వస్తుంది. అది నాకు చాలా ఇబ్బందిగా అనిపించేది. మా ఫ్యామిలీ అంతా నటించిన మనం సినిమా కోసం ప్రత్యేకమైన శ్రద్ద తీసుకున్నాడు నాన్న. ఆ సినిమా షూటింగ్ పూర్తయ్యేవరకు అంతే కఠినంగా ఉన్నారు. గతంలో నేనెప్పుడూ నాన్నని అలా చూడలేదు” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక నాగార్జున, నాగ చైతన్య కలిసి రెండు సినిమాల్లో నటించారు. అందులో బంగార్రాజు, మనం సినిమాలు ఉన్నాయి. ఈ రెండు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక నాగ చైతన్య సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన దర్శకుడు కార్తీక్ వర్మ దండుతో ఈ సినిమా చేస్తున్నాడు. విరూపాక్ష లాంటి బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు కార్తీక్ చేస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఈ సినిమా కోసం కూడా థ్రిల్లర్ అండ్ అడ్వెంచర్ కాన్సెప్ట్ నే తీసుకున్నాడు దర్శకుడు. నాగ చైతన్య కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో రానుంది ఈ సినిమా. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.