Naga Chaitanya : ప‌డ‌వ పై నిల‌బ‌డి తాడు చుడుతున్న నాగ‌చైత‌న్య‌.. పిక్ వైర‌ల్‌

అక్కినేని నాగ‌చైత‌న్య న‌టిస్తున్న మూవీ తండేల్‌.

Naga Chaitanya – Thandel : అక్కినేని నాగ‌చైత‌న్య న‌టిస్తున్న మూవీ తండేల్‌. చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో సాయిప‌ల్ల‌వి క‌థానాయిక‌. గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే నాగచైతన్య ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

తాజాగా షూటింగ్ లొకేష‌న్‌లోని స్టిల్‌ను నాగ‌చైత‌న్య సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో పంచుకున్నాడు. ప‌డ‌పై నిల‌బ‌డి తాడుచుడుతూ ఈ ఫోటోలో చైతన్య క‌నిపించాడు. ప్ర‌స్తుతం ఈ పిక్ వైర‌ల్‌గా మారింది. డిసెంబ‌ర్ 20న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు ఈ చిత్రం రానుంది.

Gangs Of Godavari : విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్ డేట్ ఫిక్స్‌.. ఎప్పుడు, ఎక్క‌డో తెలుసా?

సముద్రంలో చేపల వేటకు వెళ్లి అనుకోకుండా పాకిస్తాన్ జలాల్లోకి వెళ్లి అక్కడి అధికారులకు పట్టుబడ్డ భారత మత్స్యకారుల కథతో ఈ సినిమా రాబోతుంది. అనిరుధ్‌ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. నాగచైతన్య-చందూ మొండేటి కాంబోలో రాబోతున్న మూడో చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి.

ఇదిలా ఉంటే.. ఈ చిత్ర డిజిట‌ల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ ద‌క్కించుకుంద‌ని తెలుస్తోంది. రూ.40కోట్ల‌కు సొంతం చేసుకుంద‌నే టాలీవుడ్ స‌ర్కిల్ స‌మాచారం.

Shyamala : బెంగళూరు రేవ్‌ పార్టీ.. ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియదు : యాంక‌ర్‌ శ్యామ‌ల‌

ట్రెండింగ్ వార్తలు