Gangs Of Godavari : విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.

Viswak Sen Gangs of Godavari Trailer Launch event date fix
Godavari Trailer Launch event : టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో నేహశెట్టి హీరోయిన్. అంజలి కీలక పాత్రలో నటిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా మే 31న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
విడుదల తేదీ దగ్గర పడడంతో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా ఈ చిత్ర టైలర్‌ను విడుదల చేసేందుకు గ్రాండ్ ఈవెంట్‌ను ప్లాన్ చేసింది. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను 25 మే 2024న హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద గల దేవి ధియేటర్‌లో నిర్వహించనున్నట్లు ఓ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించింది. సాయంత్రం 4:06 గంటలకు లాంఛ్ ఈవెంట్ ప్రారంభం కానున్నట్లు చెప్పింది.
Shyamala : బెంగళూరు రేవ్ పార్టీ.. ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియదు : యాంకర్ శ్యామల
Get ready to witness an exhilarating and intense sneak-peek of our Lankala Rathna’s Gang! ??#GangsofGodavari Grand Trailer launch Event on 25th May at Devi Theatre, RTC X Roards from 04:06pm onwards ??
#GOG worldwide grand release at theatres near you on MAY 31st! ??… pic.twitter.com/fjekux5BYc
— VishwakSen (@VishwakSenActor) May 22, 2024