Shyamala : బెంగళూరు రేవ్‌ పార్టీ.. ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియదు : యాంక‌ర్‌ శ్యామ‌ల‌

న‌టి, యాంక‌ర్ శ్యామ‌ల కూడా ఉందంటూ సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది.

Shyamala : బెంగళూరు రేవ్‌ పార్టీ.. ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియదు : యాంక‌ర్‌ శ్యామ‌ల‌

Actor Shyamala Clarity on Bangalore Rave Party

Actor Shyamala : బెంగ‌ళూరు రేవ్ పార్టీని పోలీసులు భ‌గ్నం చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ పార్టీలో తెలుగు రాష్ట్రాల‌కు చెందిన ప‌లువురు సినీ సెల‌బ్రిటీలు పాల్గొన్నార‌నే వార్త సంచ‌ల‌నంగా మారింది. టాలీవుడ్‌కు చెందిన న‌టులు శ్రీకాంత్‌, కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్‌లు ఉన్న‌ట్లు వార్త‌లు రాగా.. వారు వీటిని ఖండించారు. ఆ పార్టీలో పాల్గొన‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ పార్టీలో న‌టి, యాంక‌ర్ శ్యామ‌ల కూడా ఉందంటూ సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ క్ర‌మంలో దీనిపై న‌టి శ్యామ‌ల స్పందించింది. బెంగళూరు రేవ్ పార్టీ.. అసలు పార్టీ ఎప్పుడు జరిగిందో? ఎక్కడ జరిగిందో? త‌న‌కు తెలియ‌ద‌ని చెప్పింది. ఆ పార్టీలో తాను పాల్గొన‌లేద‌ని తెలిపింది. ఈ మేర‌కు ఓ వీడియోను విడుద‌ల చేసింది. ‘అంద‌రికీ న‌మ‌స్కారం.. బెంగళూరు రేవ్ పార్టీ.. అసలు పార్టీ ఎప్పుడు జరిగిందో? ఎక్కడ జరిగిందో? అక్కడ ఎవరెవరు ఉన్నారో నాకు అసలు ఏమీ తెలియదు. కానీ అందులో నేను కూడా ఉన్నాను అంటూ ఒక ఛానల్ నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. అస‌త్య ప్ర‌చారం చేస్తున్నారు.’ అని శ్యామ‌ల మండిప‌డింది.

Indian 2 First single : ‘ఇండియన్ 2’ నుంచి ఫ‌స్ట్ సాంగ్ .. విన్నారా? గూస్ బంప్స్..

ఎంత దిగజారుడు రాజకీయాలు అంటే ఒక పార్టీతో తాను అనుసంధానం అయి ఉన్నాననే విషయం తెలిసి పార్టీ మీద, త‌న‌ మీద బురదజల్లే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు చేసే అసత్య ప్రచారాన్ని ఎంత మాత్రం ఊరుకునేది లేదంది. వాళ్ల మీద న్యాయపరమైన యాక్షన్ తీసుకోవడం జరిగిందని చెప్పింది. వాళ్ల మీద పరువు నష్టం దావా వేసిన‌ట్లు తెలియ‌జేసింది.

ఇక జర్నలిస్టులు నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే వాళ్ళు అయి ఉండాలని సూచించింది. అంతేగాని ఇలా అసత్య ప్రచారాలు చేసే వాళ్ళు కాదు.. దయచేసి మీ అసత్య ప్రచారాలతో జర్నలిజం విలువలు తగ్గించవద్దు అంటూ వీడియోలో శ్యామ‌ల అంది.

Mahesh – Rajamouli : రాజమౌళి సినిమా కోసం మహేష్ ఫిజికల్‌గా.. ఫుడ్ విషయంలో.. సుధీర్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు..