Indian 2 First single : ‘ఇండియన్ 2’ నుంచి ఫ‌స్ట్ సాంగ్ .. విన్నారా? గూస్ బంప్స్..

సినిమాలోని ఫ‌స్ట్ సాంగ్‌ను విడుద‌ల చేసింది.

Indian 2 First single : ‘ఇండియన్ 2’ నుంచి ఫ‌స్ట్ సాంగ్ .. విన్నారా? గూస్ బంప్స్..

Kamal Haasan Indian 2 First single released

Indian 2 First single SOURAA : లోక‌నాయ‌కుడు క‌మ‌ల్‌హాస‌న్ హీరోగా శంకర్ దర్శకత్వంలో 1996లో వ‌చ్చిన సినిమా ఇండియన్(భారతీయుడు). ఈ చిత్రం అప్ప‌ట్లో భారీ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్‌గా ఇండియన్ 2 సినిమా రూపుదిద్దుకుంటోంది. తెలుగులో భార‌తీయుడు-2 పేరుతో విడుద‌ల కానుంది. ఈ చిత్రం పై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి కాగా.. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది.

జూలై 12న‌ ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను మొద‌లుపెట్టింది. అందులో భాగంగా ఈ సినిమాలోని ఫ‌స్ట్ సాంగ్‌ను విడుద‌ల చేసింది. ‘శౌర అత‌డిక సేనా స‌మ‌రం..’ అంటూ ఈ పాట సాగుతోంది. అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందించాడు. మొత్తంగా ఈ పాట వింటుంటే గూస్ బంప్స్ వ‌స్తున్నాయి.

Satyabhama : చంద‌మామ కోసం బాల‌య్య‌.. స‌త్య‌భామ ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్ ఎప్పుడు.. ఎక్క‌డంటే..?

ఇక ఇండియన్ 2 సినిమాలో సిద్ధార్థ్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, ఎస్‌.జె.సూర్య‌, బాబీ సింహ.. ఇలా చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. తమిళ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, రెడ్ జైంట్ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.