Gangs Of Godavari : విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్ డేట్ ఫిక్స్‌.. ఎప్పుడు, ఎక్క‌డో తెలుసా?

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వ‌క్ సేన్ న‌టిస్తున్న సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.

Godavari Trailer Launch event : టాలీవుడ్ యంగ్ హీరో విశ్వ‌క్ సేన్ న‌టిస్తున్న సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో నేహ‌శెట్టి హీరోయిన్‌. అంజలి కీలక పాత్రలో నటిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ ల‌పై నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా మే 31న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డ‌డంతో చిత్ర బృందం ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా ఈ చిత్ర టైల‌ర్‌ను విడుద‌ల చేసేందుకు గ్రాండ్ ఈవెంట్‌ను ప్లాన్ చేసింది. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను 25 మే 2024న హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద గ‌ల దేవి ధియేటర్‌లో నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఓ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్ల‌డించింది. సాయంత్రం 4:06 గంటలకు లాంఛ్ ఈవెంట్ ప్రారంభం కానున్న‌ట్లు చెప్పింది.

Shyamala : బెంగళూరు రేవ్‌ పార్టీ.. ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియదు : యాంక‌ర్‌ శ్యామ‌ల‌

ట్రెండింగ్ వార్తలు