Naga Chaitanya-Sobhita : ‘శోభితను మొదట కలిసింది అక్కడే’.. టాప్ సీక్రెట్ రివీల్ చేసిన నాగచైతన్య

అక్కినేని నాగ చైతన్య త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. శోభితతో పెళ్ళికి రెడీ అయ్యాడు చైతు.

Naga Chaitanya revealed the top secret that where he met Sobhita for the first time

Naga Chaitanya-Sobhita : అక్కినేని నాగ చైతన్య త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. శోభితతో పెళ్ళికి రెడీ అయ్యాడు చైతు. ఇప్పటికే వీరి పెళ్లి పనులు కూడా స్టార్ట్ చేసారు అక్కినేని ఫామిలీ. వీళ్ల పెళ్లి డిసెంబర్ 4న హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో అంగరంగ వైభవంగా జరగనుంది. ఇప్పటికే నాగార్జున దీనికి సంబందించిన క్లారిటీ కూడా ఇచ్చాడు.

Also Read : Pushpa 2 : రెండు తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడు, ఎక్కడంటే..

అయితే గత కొంత కాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఇక ఇదే విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు చైతు. వారిద్దరూ మొదట కలిసింది ఎక్కడో తెలిపాడు. ఆ ఇంటర్వ్యూ లో చైతు మాట్లాడుతూ..” నా ఓటీటీ షో లాంచ్ కోసం ముంబై వెళ్ళినప్పుడు అదే ప్లాట్‌ఫామ్ తో శోభిత కూడా ఓ షో చేస్తోంది. ఆ ఓటీటీ ప్లాట్‌ఫామ్ హోస్ట్ చేసిన షోలోనే మేమిద్దరం కలిసాం.. మొదటిసారి మేము అప్పుడే కలిసి మాట్లాడుకున్నాం” అంటూ తెలిపాడు.


అలాగే శోభిత కుటుంబంపై కూడా ప్రశంసల వర్షం కురిపించారు.”కొన్ని నెలలుగా శోభిత, ఆమె కుటుంబం గురించి తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.పెళ్లి రోజు కోసం వెయిట్ చేస్తున్న అని, నన్ను ఓ కొడుకులా చూసుకున్నారని. మా రెండు కుటుంబాలు సేమ్ ఉంటాయని..శోభిత ఓ ఫ్యామిలీ అమ్మాయి అని..మేమందరం కొన్ని పండగలు కలిసి చేసుకున్నామని” చెప్పుకొచ్చాడు చైతు.