Pushpa 2 : రెండు తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడు, ఎక్కడంటే..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా పుష్ప 2.

Allu Arjun Pushpa 2 movie pre release event in two Telugu states
Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా పుష్ప 2. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సునీల్, అనసూయ, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి సాంగ్స్, టీజర్, ట్రైలర్ రిలీజ్ చేసారు. డిసెంబర్ 5న ఈ మూవీ రిలీజ్ కానుంది. ప్రస్తుతం పుష్ప వరుస అప్డేట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Also Read : Keerthy Suresh : ‘వచ్చే నెలలో నా పెళ్లి’.. ఎప్పుడు, ఎక్కడో చెప్పేసిన కీర్తి సురేష్..
పాన్ ఇండియా లెవెల్ లో వరుస ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. ఈ మూవీ ఈవెంట్ చెన్నై, పాట్నా, ముంబైలో గ్రాండ్ గా చేసారు. ఇకపై చెయ్యనున్న ఈవెంట్స్ కూడా పెద్ద ఎత్తున ఉండబోతున్నట్టు తెలుస్తుంది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు పుష్ప 2 ప్రీ రిలీజ్ బిగ్గెస్ట్ ఈవెంట్ ను ఆదివారం డిసెంబర్ 1న హైదరాబాద్ లోని మల్లారెడ్డి కాలేజీలో జరపనున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ఈ ఈవెంట్ కి డైరెక్టర్ సుకుమార్ కూడా రానున్నారట. ఇప్పటి వరకు సుక్కు ఒక్క పుష్ప 2 ప్రొమోషన్ ఈవెంట్ కి కూడా రాలేదు. దానికి కారణం పుష్ప 2 పనులు పూర్తి కాకపోవడం.
Namaste Bombay. 🖤 pic.twitter.com/VaineMilGl
— Allu Arjun (@alluarjun) November 29, 2024
ఇప్పుడు ఆ పనులన్నీ పూర్తియ్యాయి. అందుకే మల్లారెడ్డి కాలేజీలో జరిగే ఈవెంట్ కి రానున్నట్టు తెలుస్తుంది. మల్లారెడ్డి కాలేజీతో పాటు చిత్తూరులో కూడా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. రెండు వేరే స్టేట్స్ లో పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక బన్నీ క్రేజ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ లెవెల్ లో ఉంటుందో తెలిసిందే.