Keerthy Suresh : ‘వచ్చే నెలలో నా పెళ్లి’.. ఎప్పుడు, ఎక్కడో చెప్పేసిన కీర్తి సురేష్..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తాజాగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.

My wedding is next month Keerthy Suresh clarity on her marriage
Keerthy Suresh : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తాజాగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొన్నారు. ఇక ఈ సందర్బంగా కీర్తి సురేష్ ను తన పెళ్లి పై వస్తున్న వార్తల గురించి అడిగారు. తిరుపతిలో తన పెళ్లి పై మరోసారి క్లారిటీ ఇచ్చింది కీర్తి. తన పెళ్లి ఎప్పుడు, ఎక్కడో వివరించింది. దీంతో కీర్తి సురేష్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ వుతున్నాయి.
Also Read : Naga Chaitanya – Sobhita Dhulipala : నాగచైతన్య-శోభితల హల్దీ వేడుక.. ఫోటోలు చూశారా?
కీర్తి సురేష్ మాట్లాడుతూ.. త్వరలోనే పెళ్లిచేసుకోబోతున్నట్టు తెలిపారు. గోవాలో వచ్చే నెల తన వివాహం జరగనుందని చెప్పుకొచ్చింది. పెళ్లి దగ్గర పడుతుండడంతో శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చినట్లు తెలిపారు. డిసెంబర్ 11,12 తేదీల్లో తమ వివాహం జరగనుందని స్వయంగా తెలిపారు కీర్తి సురేష్. అలాగే నెక్స్ట్ తను చేసిన బేబీ జాన్ సినిమా రాబోతుందని తెలిపింది.
#GetsCinema UPDATE ✅#KeerthySuresh Confirmed her MARRIAGE – Next Month in GOA 🤩🤩🤩💥💥💥
— GetsCinema (@GetsCinema) November 29, 2024
ఇకపోతే తన చిన్ననాటి స్నేహితుడైన ఆంటోనీతో చాలా కాలంగా ప్రేమలో ఉంది ఈ భామ. దాదాపు 15 ఏళ్ల రిలేషన్ లో ఉన్న కీర్తి పెద్దలను ఒప్పించి వచ్చే నెల గోవాలో వివాహం చేసుకోబోతున్నారు.