Naga Chaitanya-Sobhita Dhulipala : చై, శోభిత వెడ్డింగ్ కార్డ్ వైరల్.. పెళ్లి ఎప్పుడు.. ఎక్కడంటే..

అక్కినేని వారసుడు నాగ చైతన్య త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. నటి శోభితను త్వరలోనే వివాహమాడనున్నాడు. ఇప్పటికే పెళ్లి పనులు కూడా స్టార్ చేశారు.

Naga Chaitanya Sobhita Dhulipala Wedding Card Viral

Naga Chaitanya-Sobhita Dhulipala : అక్కినేని వారసుడు నాగ చైతన్య త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. నటి శోభితను త్వరలోనే వివాహమాడనున్నాడు. ఇప్పటికే పెళ్లి పనులు కూడా స్టార్ చేశారు. ఇక ఈ విషయాన్ని వారే స్వయంగా తెలియజేసారు. మరి కొన్ని రోజుల్లో ఈ జంట ఒక్కటి కానున్నారు. కొంత కాలం శోభితతో రిలేషన్ లో ఉండి రెండో పెళ్లి చేసుకుంటున్నాడు చై.

Also Read : Shahid Kapoor : ఆగిపోయిన షాహిద్ కపూర్ ‘అశ్వత్థామ’.. అదే కారణమా..

అయితే వీరిద్దరి పెళ్లి డేట్ దగ్గరపడుతుండడంతో తాజాగా వీరి శుభలేఖ బయటపడింది. సోషల్ మీడియా వేదికగా శుభలేఖ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఆ వెడ్డింగ్ కార్డ్ లో డిసెంబర్ 4న నాగ చైతన్య, శోభితల వివాహం జరగనున్నట్టు ఉంది. పెళ్లి వేదిక, అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగనుందని అందులో పేర్కొన్నారు. హిందూ సంప్రదాయ పద్దతిలో వీరిద్దరి వివాహం జరగనున్నట్టు తెలుస్తుంది. రాత్రి 8:13 నిమిషాలకి ముహూర్తమని.. అందరూ వచ్చి ఆశీర్వదించండని శుభలేఖలో పేర్కొన్నారు.

ఇక నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ సినిమా చేస్తున్నాడు. నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా చందూ మొండేటీ దర్శకత్వంలో వస్తుంది. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.