Naga Durga : సినిమా చేయాలంటే.. నిర్మాతకు 15 కండిషన్స్ పెట్టిన తెలుగు హీరోయిన్..

యూట్యూబ్ లో పాటలతో డ్యాన్సర్ గా ఫేమ్ తెచ్చుకుంది తెలుగమ్మాయి నాగదుర్గ. (Naga Durga)

  • Published on- June 25, 2026 / 03:21 PM IST

Naga Durga

Naga Durga : సినిమా అవకాశాల కోసం ఎంతోమంది ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. హీరోయిన్ ఛాన్స్ అంటే ఎగిరి గంతేస్తారు. కానీ కొంతమంది మాత్రం సినిమా అవకాశాలు వచ్చినా తమకు కొన్ని కండిషన్స్, రూల్స్ పెట్టుకొని తమకు కంఫర్ట్ అనుకుంటేనే సినిమా చేస్తారు. అలాంటి హీరోయిన్స్ కూడా చాలా మందే ఉన్నారు. తాజాగా నిర్మాత బన్నీ వాసు తెలుగు హీరోయిన్ అలా కండిషన్స్ పెట్టిందని వ్యాఖ్యలు చేసారు.

యూట్యూబ్ లో పాటలతో డ్యాన్సర్ గా ఫేమ్ తెచ్చుకుంది తెలుగమ్మాయి నాగదుర్గ. ఇప్పుడిప్పుడే సినిమాల్లో అవకాశాలు తెచ్చుకుంటుంది. నాగదుర్గ హీరోయిన్ గా ప్రియదర్శి హీరోగా బన్నీ వాసు, సుకుమార్ నిర్మాణంలో నేడు ఇడుపు కాయితం అనే సినిమా ఓపెనింగ్ కార్యక్రమం జరిగింది.

Also See : Idupu Kayitham Movie Opening : ప్రియదర్శి కొత్త సినిమా ఓపెనింగ్.. ఇడుపు కాయితం.. ఫొటోలు..

ఈ కార్యక్రమంలో బన్నీ వాసు మీడియాతో మాట్లాడుతూ.. ఈ సినిమాలో హీరోయిన్‌గా చేయాలని నాగదుర్గను అడిగినప్పుడు ఆమె మాకు 15 రూల్స్, కండిషన్స్ పెట్టింది. ఆ రూల్స్ అన్ని నేను రాసుకున్నాను. ఆ తర్వాత అందులో 6 కండిషన్స్ తీసేసినా ఇంకా 9 కండిషన్స్ పెట్టింది. ఇన్ని కండిషన్స్ పెట్టినా నేను ఆనందించాను. ఒక తెలుగమ్మాయితో డీల్ చేస్తే ఎలా ఉంటుందో చూపించింది. ఒక తెలుగు అమ్మాయి ఏ విషయంలో అయినా ఎంత క్లారిటీగా ఉంటుందో తను చూపించింది అని అన్నారు.

అయితే నాగదుర్గ.. నేను మరీ అన్ని కండిషన్స్ పెట్టలేదు అని చెప్పబోతుంటే ఆ కండిషన్స్ బయటకు చెప్పొద్దులే అంటూ బన్నీ వాసు ఆపేసారు. దీంతో నిర్మాత వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి సుకుమార్ ప్రొడ్యూసర్ గా చేసే సినిమాలో హీరోయిన్ గా అవకాశం వస్తే నాగదుర్గ పెట్టిన కండిషన్స్ ఏంటో..